Mattu Vadalara-2: ఫైనల్లీ.. ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మత్తు వదలరా-2’

by sudharani |   ( Updated:2024-10-09 13:33:23.0  )
Mattu Vadalara-2: ఫైనల్లీ.. ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మత్తు వదలరా-2’
X

దిశ, సినిమా: చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీస్‌లో ‘మత్తు వదలరా’ (Mattu Vadalara) ఒకటి. ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’ (Mattu Vadalara-2) వచ్చిన విషయం తెలిసిందే. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఇక శ్రీ సింహ కోడూరి (Shri Simha Koduri), సత్య (Satya), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ప్రధాన పాత్రల్లో నటించిన ‘మత్తు వదలరా 2’ (Mattu Vadalara-2) సెప్టెంబర్ 13న రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక ఫైనల్‌గా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా.. దసరా కానుకగా అక్టోబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

Advertisement

Next Story