Mallika Sherawat: బోల్డ్ సీన్స్ కూడా కంఫర్ట్‌గా చేయొచ్చు.. నటి షాకింగ్ కామెంట్స్

by sudharani |
Mallika Sherawat: బోల్డ్ సీన్స్ కూడా కంఫర్ట్‌గా చేయొచ్చు.. నటి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: రాజ్ కుమార్ రావు (Raj Kumar Rao), త్రిప్తి డిమ్రి (Tripti Dimri) జంటగా నటించిన చిత్రం ‘విక్కీ విద్య కా వో వీడియో’. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది మల్లికా శెరావత్ (Mallika Sherawat). దాదాపు రెండుళ్ల తర్వాత మళ్లి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ‘మర్డర్’లో బోల్డ్ సీన్స్ చెయ్యడంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘కెరీర్ స్టార్టింగ్‌లో గొప్ప వ్యక్తులను కలిశాను. వారి వల్లే నన్ను నేను మార్చుకున్నా. మహేశ్ భట్ (Mahesh Bhatt) నాకు సపోర్ట్ చేశారు. ఆయన సెట్స్‌లో అమ్మాయిలకు ఎంతో రక్షణ ఉంటుంది. మహేశ్ నిర్మించిన ‘మర్డర్’ లో నాపై కొన్ని బోల్డ్ సీన్స్ తీశారు. సెట్‌లో ఎంతో మంది ఉంటారు. వారి ఎదుట బోల్డ్ సీన్స్ చెయ్యాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది. అది సహజం అయినప్పటికీ నటీనటులు ఏమాత్రం ఇబ్బందిపడకుండా ఉండేలా మహేశ్ భట్ సెట్‌లో సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేశారు. దానివల్లే ఆయా సన్నివేశాల్లో నేను సౌకర్యంగా యాక్ట్ చెయ్యగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed