Rajnath singh: భారత సైన్యం అత్యంత విశ్వసనీయమైంది.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

by vinod kumar |
Rajnath singh: భారత సైన్యం అత్యంత విశ్వసనీయమైంది.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో అత్యంత విశ్వసనీయమైన, స్ఫూర్తిదాయకమైన సంస్థల్లో భారత సైన్యం ఒకటని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. సరిహద్దులను కాపాడటం, ఉగ్రవాదంపై పోరాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. శుక్రవారం ఆర్మీ కమాండర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి రాజ్ నాథ్ ప్రసంగించారు. వివాదాల పరిష్కారంపై భారత్ జాగ్రత్తగా ఉందన్నారు. సాయుధ దళాలు ప్రణాళికలను రూపొందించేటప్పుడు అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

తూర్పు లడఖ్‌లో భారత్, చైనాల మధ్య సైనిక ప్రతిష్టంభన ఐదో ఏడాదిలోకి ప్రవేశిస్తోందని, కానీ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంట ఉన్న సమస్యలకు పరిష్కారం చూపే సూచనలు లేవని స్పష్టం చేశారు. తాను ఐదేళ్లకు పైగా ఆర్మీ కమాండర్ల సదస్సుకు హాజరయ్యానని, ఈ ఉన్నత స్థాయి చర్చలు సాయుధ బలగాలకు దేశం మొత్తానికి ప్రయోజనం చేకూరుస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో రహదారి కమ్యూనికేషన్‌ను గణనీయంగా మెరుగు పరిచినందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో)ని అభినందించారు. ఈ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు.

Advertisement

Next Story