- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister: ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు...
దిశ, ఆందోల్: ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గామాత అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో 9 రోజులపాటు భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించి, చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అన్నారు. దసరా పండుగ ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మధ్య స్నేహభావాన్ని పెంపొందించి సమాజం ఐక్యమత్యంతో ఉండేలా చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య వైద్యం ప్రతి ఒక్కరికి చేరాలని తలంపుతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. పేదింటి బిడ్డలకు అత్యుత్తమ విద్య అందించాలని తలంపుతో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనల విషయాన్ని ఈ సందర్భంగా ఉదాహరించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో దసరా ఉత్సవాలను జరుపుకోవాలని, ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.