Honeymoon Express: ఓటీటీ ట్రెండింగ్‌లో హెబ్బా పటేల్ రొమాంటిక్ మూవీ

by sudharani |   ( Updated:2024-10-11 16:23:33.0  )
Honeymoon Express: ఓటీటీ ట్రెండింగ్‌లో హెబ్బా పటేల్ రొమాంటిక్ మూవీ
X

దిశ, సినిమా: మంచి కంటెంట్‌తో వచ్చే సినిమాలకు ఓటీటీలో స్పెషల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని చిత్రాలు అయితే నెలల తరబడి ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఇదే విధంగా ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేకేఆర్, బాల రాజ్ నిర్మించారు. చైతన్య రావు (Chaitanya Rao), హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రం కెమిస్ట్రీ అద్భుతంగా పండింది అని చెప్పుకోవచ్చు. అలాగే చైతన్య రావు (Chaitanya Rao) చేస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఆయన ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు ట్రై చేస్తాడు.

ఈ క్రమంలో రీసెంట్‌గా వచ్చిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్(Honeymoon Express) కి థియేటర్లో, ఓటీటీలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక ఈ చిత్రం ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఆల్రెడీ 70 మిలియన్ల మినిట్స్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఆహాలోకి వచ్చి దుమ్ములేపుతోంది. మొదట్లో అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ గత కొన్ని రోజులుగా ఆహా వినియోగ దారుల్‌ని సైతం ఎంటర్టైన్ చేస్తోంది. ప్రస్తుత తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల మీద అందరినీ ఆకట్టుకునేలా, అందరినీ మెప్పించేలా ఈ చిత్రాన్ని తీశారు. అందుకే యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ చిత్రం మరింతగా నచ్చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed