- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డెన్మార్క్ లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు
దిశ, వెబ్ డెస్క్ : డెన్మార్క్ తెలంగాణ సొసైటీ(DTS) ఆధ్వర్యంలో అక్టోబర్ 5న సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రంగు రంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చి... మహిళలు, పిల్లలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడి పాడారు. జానపద పాటలు, బతుకమ్మ పాటలకు.. వందలాది మంది ఎన్ఆర్ఐలు, స్థానికులు చప్పట్లతో నృత్యాలు చేశారు. తెలంగాణ సంప్రదాయ వంటలను డెన్మార్క్ వాసులకు వడ్డించి, మెప్పించారు. తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ వేడుకలను డెన్మార్క్ వాసులు ఆసక్తిగా తిలకించి, ఆనందించారు. ఈ వేడుకలు తెలంగాణ వారిని ఒకచోట చేర్చడమే కాకుండా, డానీష్ సమాజానికి తెలంగాణ సంస్కృతిని పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. కాగా ఈ కార్యక్రమాలను డెన్మార్క్ తెలంగాణ సొసైటీ కార్యనిర్వాహక సభ్యులు జయచందర్ రెడ్డి కంది, కరుణాకర్ రెడ్డి బయ్యపు, రంజిత్ రెడ్డి ఓలాద్రి, సంగమేశ్వర్ రెడ్డి బిల్లా, వాసు నీల, సంతోష్ దేవునూరి, నరేందర్ రెడ్డి బొల్లా, నరేందర్ రెడ్డి అదమాల, దామోదర్ లట్టుపల్లి, సాయి గజ్జల, జగదీశ్వర్ రెడ్డి పంజా, రంజిత్ బైరెడ్డి విజయవంతంగా నిర్వహించారు.