నోబెల్ ప్రైజ్ ఎఫెక్ట్.. విరగబడి కొంటున్న హాన్ కాంగ్ పుస్తకం

by Mahesh Kanagandla |
నోబెల్ ప్రైజ్ ఎఫెక్ట్.. విరగబడి కొంటున్న హాన్ కాంగ్ పుస్తకం
X

దిశ, నేషనల్ బ్యూరో: నోబెల్ పురస్కారాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్నది. ఈ సారి సాహిత్యవిభాగంలో దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ దక్కింది. ఈ నోబెల్ ప్రైజ్ వచ్చే వరకు హాన్ కాంగ్ పుస్తకానికి పెద్దగా డిమాండ్ లేదు. కానీ, అనూహ్యంగా తమ దేశపు రచయిత్రికి నోబెల్ పురస్కారం దక్కడంతో స్థానిక పాఠకులు ఆమె పుస్తకం కోసం ఎగబడ్డారు. పుస్తకాల వెబ్‌సైట్‌లలో ఆర్డర్‌ల కోసం తంటాలు పడ్డారు. చాలా వెబ్ సైట్లు క్రాష్ అయ్యాయి. దేశంలోనే పెద్ద బుక్ స్టోర్ చైన్ క్యోబో బుక్ సెంటర్ బ్రాంచీల్లోనూ ఆమె పుస్తకాలు దాదాపుగా కావొచ్చాయి. మరికొన్ని రోజులకు సరిపడా పుస్తకాలు మాత్రమే ఉన్నాయని సిబ్బంది తెలిపారు. శుక్రవారం ఆమె పుస్తకాల కోసం పుస్తకప్రియులు బుక్ షాపుల ముందు క్యూలు కట్టారు. కానీ, రచయిత్రి హాన్ కాంగ్ మాత్రం లైమ్ లైట్‌కు దూరంగానే ఉన్నారు.

సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందడం దక్షిణ కొరియాకు ఇదే తొలిసారి. అందుకే తాను చాలా సంతోషిస్తున్నట్టు 32 ఏళ్ల పాఠకుడు యూన్ కి హియిన్ సెంట్రల్ సియోల్‌లో పేర్కొన్నాడు. గురువారం హాన్ కాంగ్‌కు నోబెల్ ప్రైజ్ ప్రకటించగానే బుక్ స్టోర్ వెబ్‌సైట్లకు హెవీ ట్రాఫిక్ వచ్చిందని చెప్పారు. ‘నా కూతురి రైటింగ్ చాలా సున్నితంగా, సుందరంగా, బాధగా ఉంటుంది’ అని ఆమె తండ్రి, ప్రముఖ రచయిత హాన్ సియుంగ్ వన్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed