చెన్నై శివారులో ఘోర రైలు ప్రమాదం

by M.Rajitha |   ( Updated:2024-10-11 16:31:48.0  )
చెన్నై శివారులో ఘోర రైలు ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజధాని చెన్నై(Chennai) నగర శివారులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు నంబర్ 12578 మైసూర్ -దర్భంగా(Mysuru-Darbhanga) మధ్య నడిచే భాగమతి ఎక్స్ ప్రెస్(Bhagamati Express) చెన్నై డివిజన్ లోని తిరువళ్ళూరు సమీపంలోని కవరిపేటై వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు, గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురవ్వగా.. రెండు బోగీలు పూర్తిగా తగలబడి పోతున్నట్టుగా తెలుస్తోంది. కాగా కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయని, స్థానికుల సహాయంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు రైల్వే అధికారులు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story