- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలపైన లైంగిక దాడి, వేధింపులు జరిగితే ఎలా గుర్తించాలి...?
మేడమ్.. నాకు ఆరేళ్ల పాప ఉంది. ఈ మధ్యకాలంలో పిల్లల మీద లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. లైంగిక దాడి జరిగినా భయంతో పిల్లలు చెప్పరు. పిల్లలపైన లైంగిక దాడి లేదా వేధింపులు జరిగితే ఎలా గుర్తించాలి...? - సహజ, నల్లగొండ
మీరు మంచి, బాధ్యతాయుతమైన ప్రశ్న వేశారు. అందుకు అభినందిస్తున్నాను. ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఇది. మాములుగా మూడురకాల లక్షణాలు పిల్లల మీద (3- 15 సంవత్సరాలు) లైంగిక దాడి జరుగుతున్నదని మనకు పట్టిస్తాయి.
1) మానసిక లక్షణాలు:
డిప్రెషన్, ఆందోళన, భయం, కోపం, ఉద్రేకం, ఆత్మహత్యా ధోరణి, ఉండుండి ఏడవడం, తప్పు చేసినట్లు గిల్టీగా ఫీలవడం, వంటరితనాన్ని కోరుకోవడం, మతిమరుపు, ఏకాగ్రత కోల్పోవడం, చదువుపట్ల ఆసక్తి పోవడం... మగవాళ్ళని చూసి పానిక్ అయిపోవడం, ద్వేషం పెంచుకోవడం, ఇంట్లోంచి లేదా హాస్టల్, స్కూల్ నుంచి పారిపోవడం, నిద్రలో మూత్ర విసర్జన చేయడం, చీకటిని చూసి భయపడటం, అన్నం మానేయడం.
2) మనోశారీరక లక్షణాలు:
తలనొప్పి, జీర్ణ సంబంధ వ్యాధులు, ఒళ్ళు నొప్పులు, ఆకలి లేకపోవడం, అసిడిటీ, కడుపులో నొప్పి, నిద్రలో పీడకలలతో లేవడం, వంటరిగా పడుకోడానికి భయపడటం, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (ptsd) అంటే తీవ్రమైన సంఘటన జరిగాక కలిగే మానసిక ఒత్తిడి, విభ్రాంతికి లోనవడం, అవసరానికి మించి స్పందించడం, రౌద్రంగా మారిపోవడం.
3) శారీరక లక్షణాలు:
పిల్లల శరీరంపై గోళ్ళ/కొరికిన రక్కులు, ముఖ్యంగా రజస్వల కానీ పిల్లల్లో లో దుస్తులపై రక్తం / వీర్యం మరకలు కనిపించడం. పాయు మార్గంలో, యోని చుట్టూ, స్త్రీ పురుష జననాంగాల చుట్టూ వాపు, ఎరుపు, మంట, నొప్పి, గాయాలు కనిపించడం. పిల్లలు నొప్పి మూలంగా కాళ్లు వెడల్పు చేసి కష్టంగా నడుస్తుంటారు. యూరినరీ ట్రాక్టు ఇన్ఫెక్షన్ వలన మూత్రంలో మంట అని ఏడుస్తుంటారు. స్నానం చేయించేటప్పుడు కూడా ఏడుస్తుంటారు. బాలల్లో కూడా పురుషాంగం వాచి నొప్పి, మంటతో ఏడుస్తారు. అనవసర ద్రవాలతో ఇబ్బంది పడతారు.
సుఖ వ్యాధుల లక్షణాలు :
- జననంగాల్లో వాపు, దురద, పుండ్లు. బాలికల్లో పై లక్షణాలతో పాటు గజ్జల్లో లింపు గ్రంధుల వాపు, నొప్పి, జ్వరం ఉంటాయి.
- రజస్వల అయిన ఆడపిల్లల్లో భయంతో హార్మోనుల అపసవ్యత వలన పీరియడ్స్ ఆలస్యంగా రావడం లేదా రాకపోవడం, గర్భం దాల్చడం.
- చిన్న పిల్లలు తల్లిదండ్రులను తమను ముట్టుకొనివ్వరు. వారి ముందు నగ్నంగా నిలబడరు. స్నానం కూడా చేయించనివ్వరు.
తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం
నేరస్థుడు లేక పీడోఫీలిక్ అంటే చిన్న పిల్లలమీద లైంగిక అత్యాచారాలు చేసేవాళ్ళని పీడో ఫీలిక్ అంటారు. అమ్మ నాన్నలను ఏమైనా చేస్తాడేమో అని, అలాగే తల్లిదండ్రులు తమని అర్థం చేసుకోక తమదే తప్పు అని శిక్షిస్తారేమో అని పిల్లలు భయంతో చెప్పరు. కుటుంబ గౌరవం పోతుందని.. అవమానం, హేళనలకు గురికావాల్సి వస్తుందని, అందరికీ తెలిస్తే పెద్దయ్యాక పిల్ల పెళ్లి కాదేమో అని భయాలతో తల్లిదండ్రులు దాచిపెడుతారు. కంప్లైంట్ ఇవ్వరు. కానీ ఎక్కడో అక్కడ ప్రతిరోజు వందల మంది చిన్నారి పిల్లలపై పేడో ఫీలిక్ లు అత్యాచారాలు చేస్తూనే ఉంటారు. పిల్లల్లో ఈ లక్షణాలు బయట పడిన వెంటనే తల్లిదండ్రులు పానిక్ కాకుండా, డిప్రెషన్‌లోకి వెళ్లకుండా తదుపరి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పిల్లలకు మరింత ప్రేమని, ధైర్యాన్ని, శ్రద్దనీ ఇవ్వాలి. వాళ్లలో గిల్టీ ఫీలింగ్ పోగొట్టాలి. చైల్డ్ కౌన్సెలెర్‌ల దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించాలి. శారీరిక బాధలకు ట్రీట్మెంట్ ఇప్పియ్యాలి. పిల్లలు ఎవరిదగ్గరికైనా వెళ్ళము అంటే అసలు పంపద్దు. ఎందుకంటే తెలిసిన వాళ్లే, కుటుంబ సభ్యులు బాబాయిలు, మాములు, అన్నలు, తండ్రులు, స్కూల్ ఆటోడ్రైవర్లు, ట్యూషన్ మాస్టర్లు, పక్కింటి అబ్బాయిలు వీళ్ళు మాత్రమే ఇట్లాంటి పనులు చేస్తారు.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్