- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bhavani initiation : భవానీ దీక్షల విరమణకు భారీగా భక్తులు
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి(Indrakiladri) శ్రీ దుర్గా మల్లీశ్వర కనకదుర్గ ఆలయం(Durgamma temple)లో డిసెంబరు 21 నుండి డిసెంబర్ 25 వరకు వార్షిక భవానీ దీక్షా విరమణ కార్యక్రమం కొనసాగుతోంది. భవాని దీక్ష విరమణ(Bhavani initiation Retreats) కోసం భక్తులు ఆదివారం రెండో రోజు పెద్ద సంఖ్యలో కాలినడకన తరలివస్తున్నారు. జై దుర్గా.. జై జై దుర్గ అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. భవానీ దీక్షల విరమణ కోసం భారీగా తరలిరానున్న భక్తుల కోసం దేవస్థానం అవసరమైన ఏర్పాట్లు చేసింది. 6లక్షల మంది భవానీ దీక్షధారులు ఐదు రోజుల్లో గిరి ప్రదక్షిణ చేసి ఇరుముడులను మల్లిఖార్జున మహామండపంలో సమర్పించనున్నారు.
వేకువ జామున 3గంటల నుంచి రాత్రి 11గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దుర్గామల్లేశ్వర దేవస్ధానం, జిల్లా యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శీఘ్ర దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. రుసుము ద్వారా దర్శనం, ఆర్జిత సేవలను ఈ నెల 25వ తేదీ వరకు రద్దు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ భవానీ దీక్షల విరమణల కార్యక్రమాన్ని పరిశీలించారు. మోడల్ గెస్ట్‌హౌ్‌సలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించి, సీసీటీవీలు, డ్రోన్ విజువల్స్‌ను పరిశీలించారు. క్యూలైన్లను పరిశీలించి, భవానీ భక్తులతో ఏర్పాట్లపై మాట్లాడారు.
దీక్ష విరమణకు వచ్చే భక్తుల పర్యవేక్షణకు ఘాట్ల వద్దనే పిల్లర్ నుంచి పిల్లర్‌కు 100 అడుగుల నుంచి 200 అడుగులకు ఒక శానిటరీ ఇన్‌స్పెక్టర్, 15 మందికిపైగా పారిశుధ్య సిబ్బందిని నియమించారు. ఘాట్లలో వ్యర్థాలను ప్లాస్టిక్ డబ్బాల్లోకి నింపి, వెంటనే మెయిన్‌రోడ్డుపై సిద్ధంగా ఉంచిన ట్రాక్టర్లలో నింపి, డంప్ యార్డుల్లోకి తరలించారు. ఎక్కడక్కడే ఎరుపురంగు దుస్తులను వదిలేయడంతో వాటిని పారిశుధ్య సిబ్బంది ప్లాస్టిక్ డబ్బాల్లోకి ఎత్తి మరో ట్రాక్టర్లలోకి ఎక్కిస్తున్నారు. ఘాట్ల వద్ద, ప్రకాశం బ్యారేజీ, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, బస్టాండ్, రైల్వేస్టేషన్, మార్కెట్ల వద్ద రూట్లను తెలిపే సూచికలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేశారు.