- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షపు నీరు నిలవకుండా రోడ్లు నిర్మించాలి
దిశ, ఖమ్మం : వర్షపు నీరు నిలవకుండా సాఫీగా వెళ్లే విధంగా రోడ్లు, డ్రైన్ ల నిర్మాణ పనులు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం మంత్రి రఘునాథపాలెం మండలంలో పలు గ్రామాలలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రూ. 27 లక్షలతో పుటాని తండాలో చేపట్టే 5 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, రూ. కోటి 36 లక్షల 50 వేలతో బూడిదంపాడులో చేపట్టిన 27 సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మాణ పనులకు, రూ. 10 లక్షలతో సూర్యతండాలో చేపట్టిన ఒక సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో చేపట్టిన రోడ్లు, డ్రైన్ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని, పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.