- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగులోకి ‘ఝాన్సీ ఐపీఎస్’.. పవర్ ఫుల్ పాత్రలో నటించిన లక్ష్మీ రాయ్
దిశ, సినిమా: లక్మీ రాయ్ (Lakshmi Roy) ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ ‘ఝాన్సీ ఐపీఎస్’ (Jhansi IPS). గురు ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ, కన్నడ భాషలలో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ‘ఝాన్సీ ఐపీఎస్’ తెలుగు హక్కులను ఆర్ కె ఫిలిమ్స్ అధినేత, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ‘మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో లక్ష్మీ రాయ్ (Lakshmi Roy) చాలా అద్భుతంగా నటించారు. అందులో ముఖ్యంగా డ్రగ్స్ (drugs) సప్లై చేస్తూ కాలేజ్ అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసే ముఠాని ఆట కట్టించే పాత్రలో లక్ష్మీరాయ్ చాలా అద్భుతమైన ఫైట్స్ చేశారు. గతంలో ఏ సినిమాలో కూడా చేయనటువంటి సూపర్ యాక్షన్ క్యారెక్టర్‌లో నటించింది లక్ష్మీ రాయ్ (Lakshmi Roy). అలాగే భూ కబ్జా చేసి కట్టిన బిల్డింగులు నేలమట్టం చేసి, కబ్జారాయుళ్ల గుండెల్లో నిద్రపోయే ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించింది. ఈ క్యారెక్టర్ నిజ జీవితానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్. తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ త్వరలో రిలీజ్ చేసి, నవంబర్‌లో అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.