మహేష్ పుట్టినరోజు సందర్భంగా బిగ్ స్క్రీన్‌పై పోకిరి!

by Nagaya |
మహేష్ పుట్టినరోజు సందర్భంగా బిగ్ స్క్రీన్‌పై పోకిరి!
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్‌గా నిలిచిన 'పోకిరి' సినిమా మళ్లీ థియేటర్స్‌లో సందడి చేయనుంది. తాజాగా నమ్రత మహేష్ అభిమానులకు ఈ గుడ్ న్యూస్ తెలియజేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2006లో ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టడమే కాక సరికొత్త ట్రెండ్‌ సెట్ చేసింది. విడుదలై 16 ఏళ్లయినప్పటికీ ఇంకా ఈ మూవీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

టెలివిజన్‌లో ఎప్పుడు ప్రసారమైనా టీఆర్‌పీ రేటింగ్స్‌లో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను థియేటర్స్‌లో మళ్లీ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే, పాత ఫార్మాట్‌లో కాకుండా 4K రిజల్యూషన్‌లోకి రీమాస్టర్ చేసి, డాల్బీ ఆడియో టెక్నాలజీతో మాడిఫై చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు భారీ ఎత్తున ప్రీమియర్ షోస్ కూడా అంతా సిద్ధం చేస్తున్నారు. మరి అభిమానుల సందడి ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed