ఆ స్టార్ హీరో కొడుకుతో మహేష్‌బాబు మరదలి పెళ్లి ఫిక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్

by Kavitha |
ఆ స్టార్ హీరో కొడుకుతో మహేష్‌బాబు మరదలి పెళ్లి ఫిక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi chowdary) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. దీంతో ఆమె నటించిన అన్ని సినిమాల్లో ఆమె క్యారెక్టర్‌కు మంచి మార్కులే పడ్డాయి. అలా ‘హిట్-2’(Hit2), ‘ఖిలాడి’(Khiladi) వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘గుంటూరు కారం’(Gunturu Karam) మూవీలో మహేష్ బాబు(Mahesh babu) మరదలి పాత్రలో నటించిన ఈ భామ.. ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ..విశ్వక్ సేన్(Vishwaksen) హీరోగా చేస్తున్న మెకానిక్ రాకీ(Mechanic Rocky), వరుణ్ తేజ్(Varun Tej) ‘మట్కా’(Matka) మూవీలో హీరోయిన్‌గా చేస్తుంది. ఇక దుల్కర్ సల్మాన్‌(Dulkar Salman)తో మీనాక్షి చౌదరి నటించిన ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇలా వరుస ఆఫర్స్‌తో బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా పెళ్లి(Marriage) చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో భాగంగా కొలీవుడ్(Kollywood) స్టార్ హీరోతో మీనాక్షి చౌదరి పెళ్ళికి సిద్ధమైందనే వార్త నెట్టింట షికారు చేస్తున్నది. అంతేకాక పెళ్లి కూడా ఫిక్స్ అయినట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక దీనిపై కొంతమంది అప్పుడే ఈ భామ పెళ్లి చేసుకుంటుందా.. ఇదంతా రూమర్సే అంటూ కొట్టి పారేస్తుంటే.. మరికొంత మందేమో మీనాక్షి చౌదరి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ మధ్య హీరోయిన్ల పెళ్లిళ్ల గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని నిజమైతే, మరికొన్ని పుకార్లు ఉంటాయి. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ఈ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed