- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దావూద్‌కు మహా ప్రభుత్వం అంకితం: బీజేపీ నేత ఫడ్నవీస్ తీవ్ర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1993 ముంబై దాడుల్లో కీలక కుట్రదారుగా ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు మహా వికాస్ అగాధీ(ఎంవీఏ) పార్టీ అంకితమైందని అన్నారు. గురువారం విదాన్ భవన్ పరిసరాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు తగినన్ని ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు. 'ఎంవీఏ ప్రభుత్వం దావూద్‌కు అంకితమైంది. నవాబ్ మాలిక్‌కు దావూద్‌తో సంబంధాలు ఉన్నట్లు తగినన్ని ఆధారాలు ఉన్నాయి. ముంబైపై దాడి చేసిన వ్యక్తుల పట్ల ప్రభుత్వం బహిరంగంగా సానుభూతి చూపిస్తుంది. శివసేనను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అధికారంలో ఉన్నారని ముంబై పేలుళ్ల ఘటనతో కీలక వ్యక్తితో సంబంధాలు ఉన్న వ్యక్తి పట్ల సానుకూలతను ప్రదర్శిస్తుంది' అని అన్నారు. ఇప్పటికైనా నవాబ్ మాలిక్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బడ్జెట్ సెషన్లను బీజేపీ అనుమతించదని అన్నారు. కాగా, మనీ లాండరింగ్ ఆరోపణలతో గత వారమే రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యేలు
మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ ప్రసంగిస్తున్న సమయంలో మహావికాస్ అగాధీ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. గవర్నర్ ఇటీవల ఛత్రపతి శివాజీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ వారు ఆందోళనకు దిగారు. దీంతో కొష్యారీ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి బయటకు వెళ్లిపోయారు. విపక్ష పార్టీ బీజేపీ అధికార పక్షం పై విమర్శలకు దిగింది. ఇరువర్గాల వాగ్వాదం తో గవర్నర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.