- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
18వ శతాబ్దపు మెట్ల బావి.. ఆశ్చర్యపరుస్తున్న నిర్మాణ శైలి
దిశ, ఫీచర్స్ : చారిత్రక కట్టడాలు, పురాతన నిర్మాణాలకు తెలంగాణ ప్రాంతం ప్రసిద్ధి. శతాబ్దాల కిందటి వరకు దేదీప్యమానంగా వెలిగిన ఈ ప్రాచీన సంపద కాలక్రమేణా శిథిలావస్థకు చేరుతుండగా.. మరికొన్ని మాత్రం నేటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా, లింగంపేట్ గ్రామంలోని మెట్ల బావి కూడా ఈ కోవకు చెందిందే. 500 ఏళ్ల నాటి ఈ పురాతన కట్టడం ప్రత్యేకమైన నిర్మాణ శైలితో సందర్శకులను ఆకట్టుకుంటోంది.
ఎల్లారెడ్డి, లింగంపేట మధ్యనున్న ఈ మెట్ల బావిని స్థానికులు 'నాగన్న బావి'గా పిలుస్తుంటారు. 100 అడుగుల లోతున్న ఈ బావిని 18వ శతాబ్దంలో ఆ ప్రాంతానికి చెందిన లింగమ్మ దేశాయ్ నిర్మించారని చరిత్రకారులు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే ఉద్దేశ్యంతోనే ఆమె ఈ నిర్మాణం చేపట్టగా.. ఈ గ్రామానికి ఆమె పేరే పెట్టారు. తదనంతరం మెట్ల బావి నిర్మాణ బాధ్యతలను జక్సాని నాగన్న చూసుకోగా.. దీన్ని 'నాగన్న బావి' అని కూడా పిలుస్తారు. అయితే ఈ బావిలో ప్రస్తుతానికి నీళ్లు లేవు.
మెట్లతో కూడిన ఈ అద్భుతమైన నిర్మాణం ఐదు అంచెలుగా రూపొందించబడింది. ఒక్కో లెవెల్ కనీసం 20 అడుగుల ఎత్తు ఉండగా బావి చుట్టూ మెట్లు నిర్మించబడ్డాయి. గుర్రాలు, ఏనుగులు సులభంగా నీరు తాగేందుకు వీలుగా బావి పడమటి వైపున ఉన్న మెట్లను మిగతా వైపుల కంటే ఎక్కువ వెడల్పుతో నిర్మించారు. ఇక ప్రతి లెవెల్‌కు రెండు వైపులా గదులు కూడా ఉన్నాయి. బావిలో స్నానం చేసి బట్టలు మార్చుకోవాలనుకునే వారికి ఆశ్రయం కల్పించేందుకు ఈ గదులను నిర్మించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ప్రజలు సులభంగా చేరుకునేందుకు బావికి ఎనిమిది వైపులా మెట్లు నిర్మించబడ్డాయి.
అయితే, ఈ బావిని పునరుద్ధరించి సరైన పర్యాటక కేంద్రంగా మార్చాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతుండగా.. ఇప్పటికే ఈ పురాతన కట్టడాన్ని చూసేందుకు సమీప ప్రాంతాల ప్రజలు నిత్యం ఇక్కడికి వస్తుండటం విశేషం.