బాలీవుడ్ హీరోలపై మాధవన్ షాకింగ్ కామెంట్స్.. ఎలా నటిస్తారో అంటూ

by S Gopi |
బాలీవుడ్ హీరోలపై మాధవన్ షాకింగ్ కామెంట్స్.. ఎలా నటిస్తారో అంటూ
X

దిశ, సినిమా : ప్రముఖ సీనియర్ హీరో మాధవన్ బాలీవుడ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఆయన నటించిన చిత్రం 'రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్' విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన హీరో.. బీటౌన్ హీరోల్లో హృతిక్ రోషన్‌ను పెద్దగా పట్టించుకోనని, తన దృష్టంతా సైఫ్ అలీఖాన్ పైనే ఉందంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించాడు. విషయానికొస్తే.. 2017లో విడుదలైన 'విక్రమ్ వేద'లో మాధవన్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తే, విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న ఈ మూవీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాను ఉద్దేశించి మాట్లాడిన మాధవన్.. హృతిక్ అద్భుతంగా నటిస్తాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదని, తమిళంలో తాను పోషించిన పాత్ర సైఫ్‌ ఎలా చేస్తాడనే దానిపైనే నా దృష్టంతా కేంద్రీకృతమైనట్లు వెల్లడించాడు. అంతేకాదు వాళ్లిదరి పర్ఫామెన్స్‌ చూసేందుకు తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

Advertisement

Next Story