- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రజలకు ఇబ్బందులు పడకుండా పనులు చేపట్టాలి : ఎల్బీనగర్ ఎమ్మెల్యే

దిశ, చైతన్య పురి : చంపాపేట డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీలో సోమవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వాటర్ వర్క్స్ అధికారులచే కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు బస్తీవాసులు పలు సమస్యలను వివరించారు. కాలనీలో నూతన రోడ్ల నిర్మాణం కోసం రోడ్లు తవ్వారని ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచాక రోడ్లు వేయాలని ముందే రోడ్లు తవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్లు గతంలో మంజూరు చేసినట్లు కానీ ఇక్కడ డ్రైనేజి వ్యవస్థ సరిగ్గా లేదని తెలిసి తాత్కాలికంగా రోడ్డు నిర్మాణ పనులు నిలిపి వేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఉన్న ఎనిమిది ఇంచుల డ్రైనేజి స్థానంలో పన్నెండు ఇంచుల డ్రైనేజి నిర్మాణం చేపట్టాలని మిగిలిన మూడు వీదులలో ఎత్తుపల్లాలు సరిగ్గా చూసుకొని డ్రైనేజి నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచాక నూతన రోడ్ల నిర్మాణం పనులు చేపడుతామని తెలిపారు. ఈకార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు రమ్యభారతి, షబ్బీర్, శ్రీహరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.