Hero Splendor: జస్ట్ రూ. 60 కడితే చాలు ఈ సూపర్ బైక్ మీ సొంతం..పూర్తి వివరాలివే

by Vennela |
Hero Splendor: జస్ట్ రూ. 60 కడితే చాలు ఈ సూపర్ బైక్ మీ సొంతం..పూర్తి వివరాలివే
X

దిశ, వెబ్ డెస్క్: Hero Splendor: నేటి కాలంలో ఫైనాన్స్ పై బైక్ కొనడం మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. కొత్త బైక్ కొనేందుకు మీ వద్ద పూర్తి డబ్బు లేకుంటే మీరు ఫైనాన్స్ పై బైక్ కొనుగోలు చేయవచ్చు. ఫైనాన్స్ బైక్ కొనేందుకు మీరు కొన్ని డౌన్ పేమెంట్లు చేసుకోవాలి. ఆపై మీరు బైక్ ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. తర్వాత ప్రతినెలా ఈఎంఐ చెల్లించాలి. మీరు ఫైనాన్స్ పై బైక్ కొనాలని ఆలోచిస్తుంటే మీరు స్ప్లెండర్ ప్లస్ కొనుగోలు చేయడం బెస్ట్ ఆప్షన్. HF డీలక్స్ ధర రూ.63,900 నుండి ప్రారంభమవగా, స్ప్లెండర్ ప్లస్ X-టెక్ వేరియంట్ ధర రూ.84,351 నుండి ప్రారంభమవుతుంది. హీరో ఈ రెండు బైక్‌లపై గొప్ప ఆఫర్‌లను అందించింది. కస్టమర్లకు 5శాతం వరకు తక్షణ తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది. అంతేకాకుండా, బైక్‌పై లోన్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు రోజుకు రూ.60 EMI చెల్లించి ఈ బైక్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఆఫర్ గురించి మరిన్ని వివరాల కోసం, హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

హీరో మోటోకార్ప్ ఒక గొప్ప ఎంట్రీ లెవల్ బైక్. ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, HF డీలక్స్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో కూడిన 97.2cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 8.36 PS శక్తిని, 8.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చి ఉంటుంది. ఈ బైక్‌లో మెటల్ గ్రాబ్ రైల్, బ్లాక్ థీమ్ ఆధారిత ఎగ్జాస్ట్, క్రాష్ గార్డ్, అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.ఈ బైక్ 9.1 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం కలిగి ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165mm. బైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చక్రాలకు డ్రమ్ బ్రేక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ భారీ ట్రాఫిక్‌లో కూడా నడపడం సులభం.

స్ప్లెండర్+ XTEC 2.0 హైటెక్ ఫీచర్లతో వస్తుంది. డిజైన్‌లో పెద్ద మార్పులు చేయలేదు. ఈ బైక్‌లో పూర్తిగా డిజిటల్ స్పీడోమీటర్ మీటర్ ఉంది. రియల్ టైమ్ మైలేజ్ సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది. ఇవేకాదు బ్లూటూత్, కాల్స్, SMS, బ్యాటరీ అలర్ట్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. కొత్త స్ప్లెండర్+ XTEC 2.0 100cc i3s ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7.9 bhp శక్తిని మరియు 8.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ ఇంజిన్ మెరుగైన మైలేజీని అందిస్తుందని.. 6000 కిలోమీటర్ల వరకు సర్వీస్ అవసరం ఉండదని కంపెనీ పేర్కొంది. ఇది లీటరుకు 73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Next Story

Most Viewed