Natarajasana Yoga: పూర్ణ నటరాజసనం ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా ఇట్టే నేర్చుకొండి..(వీడియో)

by Manoj |   ( Updated:2023-10-06 08:18:19.0  )
How to do Natarajasana Yoga and benefits
X

దిశ, ఫీచర్స్: How to do Natarajasana Yoga and benefits| ఈ ఆసనం మొదటిసారి చేసేవాళ్లు మరొకరి సాయం తీసుకోవాలి. ముందుగా బల్లపరుపు నేలపై నిలబడి రిలాక్స్ అవ్వాలి. తర్వాత కుడి కాలు మోకాలును మడిచి వెనుక వైపుగా నెమ్మదిగా పైకి లేపాలి. అలా నడుంపై వరకు లేపగానే కుడి చేతితో కుడికాలి బొటనవేలు పట్టుకోవాలి. ఇప్పుడు తల వెనకకు వాల్చుతూ కుడికాలును పూర్తిగా పైకి లేపి తలను కుడి అరికాలుకు ఆన్చాలి. శరీర బరవు మొత్తం ఎడమకాలు మీదనే ఉండాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడూ బాడీ ఎటు కదల్చకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎడమకాలు నిటారుగా ఉండాలి. ఇలా కాసేపు ఆగి రిలాక్స్ అయిన తర్వాత మళ్లీ ఎడమ కాలుతో చేయాలి.

ప్రయోజనాలు:

* మోకాళ్లు, చేతులకు శక్తి చేకూరుతుంది.

* నడుము డిస్క్ సమస్యల నుంచి ఉపశమనం.

* అధిక కొవ్వు కరిగించి, ఉత్తేజితం చేస్తుంది.

* శరీరా అవయవాలన్నీ యాక్టివ్ అవుతాయి.

Advertisement

Next Story

Most Viewed