Lavanya Tripathi: ఆ విషయాన్ని తెలుపుతూ స్పెషల్ పోస్ట్ పెట్టిన మెగా కోడలు..

by Hamsa |   ( Updated:2024-11-01 15:28:54.0  )
Lavanya Tripathi: ఆ విషయాన్ని తెలుపుతూ స్పెషల్ పోస్ట్ పెట్టిన మెగా కోడలు..
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), యంగ్ బ్యూటీ లావణ్య ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి 2023లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1న వీరిద్దరు ఇటలీలోని టుస్కానీ(Tuscany) వేదికగా రాత్రి 7:18 గంటలకు ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలతో పాటు పలువురు నిర్మాతలు, నితిన్ హాజరయ్యారు. ఇక పెళ్లి జరిగినప్పటి నుంచి లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) సినిమాలకు దూరమైంది.

వరుణ్ తేజ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అలాగే షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో వెకేషన్స్‌కు కూడా వెళ్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పలు పిక్స్ షేర్ చేస్తూ స్పెషల్ పోస్ట్ పెట్టింది. పెళ్లి జరిగి నేటితో ఏడాది పూర్తి కావడంతో లావణ్య తన భర్తకు విషెస్ తెలిపింది.

అలాగే ‘‘ఆ సంవత్సరం నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన, ప్రేమగల, శ్రద్ధగల వ్యక్తిని వివాహం చేసుకున్నాను’’ అనే క్యాప్షన్ జత చేసి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అని వెల్లడించింది. అలాగే వరుణ్ తేజ్ కూడా మంచు కొండల్లో(snow hills) ఉదయించే సూర్యుడి మధ్య.. ప్రేమతో రొమాంటిక్‌గా లావణ్య(Lavanya Tripathi) ను హగ్ చేసుకున్న ఫొటో షేర్ చేశాడు. అంతేకాకుండా తన భార్యకు హ్యాపీ యానివర్సరీ(Happy Anniversary) అని విషెస్ తెలిపాడు. ప్రజెంట్ వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు అప్పుడే ఏడాది అయిందా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ మాత్రం విషెస్ తెలుపుతూ కామెంట్లు షేర్ చేస్తున్నారు.

Read More..బాలీవుడ్ ఇండస్ట్రీలో అదే ముఖ్యం.. నచ్చకపోయినా తప్పలేదంటూ రెజీనా కీలక వ్యాఖ్యలు..

Advertisement

Next Story

Most Viewed