- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రముఖ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ను శిక్ష ఖరారు.. తుది తీర్పు చెప్పిన కోర్టు
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలను అరికట్టడంలో భాగంగానే అగ్ర రాజ్యాలు సైతం ఆయా సంస్థల చీఫ్‌లను వెతుకుతుంటాయి. అయితే తాజాగా పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఓ ప్రముఖ ఉగ్రవాద సంస్థ చీఫ్‌కు శిక్ష వేసింది. ఆ కోర్టులో లష్కర్-ఇ-తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఉగ్రవాదులకు నిధులు మళ్లించిన క్రమంలో రెండు కేసులు నడుస్తున్నాయి. తాజాగా ఈ కేసులో కోర్టు తన తుది నిర్ణయం ప్రకటించింది. అతడికి శిక్ష ఖరారు చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో నడిచిన కేసులో సయీద్‌కు 31 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
సయీద్ కేసును విచారించిన లాహోర్ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం తన తుది నిర్ణయం వెల్లడించింది. సయీద్‌కు జైలు శిక్షతో పాటు రూ.3.4 లక్షల జరిమానాను విధించింది. అంతేకాకుండా అతడికి ఉన్న అన్ని ఆస్తులను జప్తు చేసుకున్నట్లు కోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే సయీద్ 2008లో ముంబైలో చోటు చేసుకున్న ఉగ్రదాడుల్లో సూత్రధారి, ఈ దాడుల్లో 166 మంది మరణించారు. అయితే అతడిని తమకు అప్పగించాలని పాకిస్తాన్‌ను భారత్ అనేక సార్లు కోరింది. కానీ ప్రతి సారి భారత్‌ను తిరస్కరిస్తూనే వచ్చింది.