Kriti Shetty: బంపర్ ఆఫర్ కొట్టేసిన కృతి శెట్టి.. యంగ్ హీరోతో రొమాన్స్!

by Hamsa |
Kriti Shetty: బంపర్ ఆఫర్ కొట్టేసిన కృతి శెట్టి.. యంగ్ హీరోతో రొమాన్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Kriti Shetty) మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘ఉప్పెన’(Uppena )తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కృతి(Kriti Shetty)కి పాపులారిటీ పెరిగింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన చాన్స్ కొట్టేసింది. దీంతో అంతా కృతి శెట్టి గోల్డెన్ లెగ్ అనుకున్నారు. కానీ హ్యాట్రిక్ ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. దీంతో అమ్మడు ఐరన్ లెగ్‌గా మారిపోయింది. తెలుగులో అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ అమ్మడు ఇటీవల శర్వానంద్ ‘మనమే’(Manamey) మూవీతో ప్రేక్షకులను అలరించింది.

కానీ హిట్ అందుకోలేకపోయింది. దీంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ఇక తెలుగులో కృతి శెట్టికి ఆఫర్లు రావడం కష్టమే స్క్రీన్‌పై కనిపించదు అని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఈ అమ్మడు ఓ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు సమాచారం. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) సరసన కృతి హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్.

ఈ సినిమాను ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu)డైరెక్టర్ అనుదీప్ (Anudeep)తెరకెక్కిస్తుండగా.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే దీనికి సంబంధించిన స్టోరీ కృతికి చెప్పడంతో దానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు టాక్. కాగా, విశ్వక్ సేన్(Vishwak Sen) ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ మూవీ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ మెకానిక్ రాకీ(Mechanic Rocky), లైలా వంటి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Advertisement

Next Story