పబ్లిక్ ప్లేస్‌లోనే బూతులు తిట్టేవాడు.. పిల్లల కోసమే భరించా.. స్టార్ యాక్ట్రెస్

by Manoj |
పబ్లిక్ ప్లేస్‌లోనే బూతులు తిట్టేవాడు.. పిల్లల కోసమే భరించా.. స్టార్ యాక్ట్రెస్
X

దిశ, సినిమా: మాజీ భర్త కాన్యే వెస్ట్‌తో తన వైవాహిక జీవితం గురించి తెలిస్తే ప్రజలు షాక్ అవుతారంటోంది కిమ్ కర్దాషియాన్. ఈ మేరకు నలుగురు పిల్లలకు తల్లిగా బాధ్యతను దృష్టిలో పెట్టుకుని తన వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి సాధ్యమయ్యే అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని తెలిపింది.

అంతేకాదు తనతో గడిపిన గడ్డు పరిస్థితుల గురించి చెబితే ఇన్నిరోజులు ఎలా కలిసున్నావని బాధపడతారన్న కిమ్.. పబ్లిక్ ప్లేసులో కూడా తన గురించి చెడుగా మాట్లాడాడని తెలిపింది. అయినా తాను పూర్తిగా అపరాధ భావనకు దూరంగా ఉండగలనని చెప్పిన ఆమె.. సెక్స్ టేప్ ఇష్యూ, కాన్యేతో మ్యారేజ్ గొడవ సమయంలోనూ ఎవరూ తన వద్దకు రాలేదని, కనీసం 'బాగున్నావా?' అని అడగలేదని ఎమోషనల్ అయింది. అయినా తాను అందరినీ గౌరవిస్తానని, ప్రతి ఒక్కరూ తన నిర్ణయాలను, జీవిత ప్రయాణాన్ని పాజిటివ్‌గా చూడాలని కోరింది.

Advertisement

Next Story

Most Viewed