- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tamilisai: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. గవర్నర్ తమిళిసై అనూహ్య వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: KCR may not go for early elections, says Tamilisai| తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లే అవకాశం లేదని అన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన తమిళిసై కేంద్ర రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తున్నారని అన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను చూసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంలో ఉండిఉంటారు కానీ, ముందస్తుకు వెళ్తారని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఇటీవల రాజ్ భవన్‌లో తనతో కేసీఆర్ భేటీ తర్వాత కూడా ప్రోటోకాల్‌లో తేడా ఏమీ లేదని అన్నారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పారు. తాను ప్రోటోకాల్ అడగడం మానేశానని, ఇటీవల వరద ముంపు ప్రాంతాల్లో తాను పర్యటిస్తుంటే ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం కలెక్టర్ రావాల్సి ఉన్నా ఆయన రాలేదని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్లు ఇలా పర్యటనలు చేయలేదుగా అనే ప్రశ్నకు తాను వేరే గవర్నర్లతో పోల్చుకోవద్దని చెప్పారు. గవర్నర్ అయినంత మాత్రాన తాను రాజ్ భవన్‌కే పరిమితం కాలేనని, ప్రజలకు దగ్గరగా ఉండటమే తన లక్ష్యమని చెప్పారు. ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి అడుగుతున్నారని అన్నారు. వరద బాధితులకు తనకు తోచిన రీతిలో ఎన్జీవోల ద్వారా దుస్తులు అందించానని చెప్పారు.
వరదలపై కేంద్రానికి రిపోర్ట్:
అంతకు ముందు మీడియాతో మాట్లాడిన గవర్నర్.. వర్షాలు వచ్చాయి కాబట్టి వరద ప్రాంతాల్లో పర్యటించానని, తాను రాష్ట్రానికి ప్రథమ పౌరురాలిని అందువల్లే ప్రజల వద్దకు వెళ్లాలని చెప్పారు. వర్షాలలో ఎక్కువగా ఆదివాసీలే నష్టపోయారని అందువల్లే ఆదివాసీలు ఉన్న ప్రాంతంమైన భద్రాచలం ఏరియాలో పర్యటించానని చెప్పారు. వర్షాలపై కేంద్ర హోం శాఖకు రిపోర్ట్‌ను అందజేశానని వాళ్లు కేంద్ర బృందాలను పంపించారని తమిళిసై అన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా రాష్ట్రానికి సహాయం చేస్తుందని అన్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని, వరదల కారణంగా ఎంత నష్టం ఏర్పడిందో ఆ వివరాలను మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని వివరించారు.
ఇది కూడా చదవండి: తమను విడదియోదంటూ.. బోనాలతో ఉపాధ్యాయ దంపతుల నిరసన
- Tags
- Tamilisai