- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్ర ప్రజల కల నెరవేరింది.. టీఆర్ఎస్ నాయకులు
దిశ, శంషాబాద్ : ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వడంతో తెలంగాణ ప్రజల కల సాకారం అయిందని నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్ అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగుల నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా శంషాబాద్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు నిర్విరామంగా పోరాడి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, అనంతరం సీఎం అయిన కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షే లక్ష్యంగా పరిపాలన కొనసాగించారని అన్నారు.
నీళ్లు, నిధుల కేటాయింపును ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్విజయంగా పూర్తి చేశారని వారు అన్నారు. నియామకాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో 91.146 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మెన్ గోపాల్ యాదవ్, కౌన్సిలర్లు మేకల వెంకటేష్, అమృతారెడ్డి,ఆయిల్ కుమార్,నాయకులు నీరటీ రాజు,మహేందర్ రెడ్డి, పవన్ గౌడ్,ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, హన్మంతు,శ్రీనివాస్ గౌడ్,రాజశేఖర్ గౌడ్, కొనమొల శ్రీనివాస్,నందు,ప్రభాకర్, సంతోష్ గౌడ్,తాజ్ బాబా,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.