- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్కడ కాంగ్రెస్‌కు షాక్.. పార్టీని వీడిన ఎమ్మెల్సీ
బెంగళూరు: కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం శనివారం పార్టీకి రాజీనామా చేశారు. దీంతో పాటు పార్టీ సభ్యత్వానికి స్వస్తి పలికారు. మరో రెండు రోజుల్లో స్థానిక పార్టీ జనతాదళ్(ఎస్)లో చేరడం పై నిర్ణయాన్ని వెల్లడిస్తానని మీడియాకు తెలిపారు. 'నేను నా పార్టీ సభ్యత్వం తో పాటు కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నాను. రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించాను' అని మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
'నా రాజీనామాతో శాసన మండలిలో బీజేపీ కి మెజారిటీ పెరుగుతుంది. దీంతో మతమార్పిడి నిరోధక బిల్లు త్వరలో ఆమోదం పొందే అవకాశం ఉంది. దీని కోసమే రాజీనామా చేస్తున్నాను' అని అన్నారు. పార్టీకి రాజీనామా చేయడంపై స్పందిస్తూ, తాను స్వేచ్ఛ జీవినని, ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉందని చెప్పారు. పార్టీ జాతీయ చీఫ్ సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, సిద్ధ రామయ్య, రాష్ట్ర చీఫ్ శివకుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు.