చిల్లర వ్యక్తులే నా సినిమాను నాశనం చేశారు.. బాలీవుడ్ నటి

by Nagaya |
చిల్లర వ్యక్తులే నా సినిమాను నాశనం చేశారు.. బాలీవుడ్ నటి
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌.. తన లేటెస్ట్ మూవీ 'ధాకడ్‌' ఫెయిల్యూర్‌పై మరోసారి స్పందించింది. రూ.85 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ.3.77 కోట్లు మాత్రమే రాబట్టడంతో ఈ బ్యూటీ దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది. అంతేకాదు తన వల్ల సదరు నిర్మాత ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చందనే రూమర్స్ కూడా వ్యాపించాయి. దీంతో మరోసారి సోషల్‌ మీడియా వేదికగా రియాక్ట్ అయిన కంగన.. 'నా సినిమాపై ఇంటర్నెట్‌లో వ్యతిరేక ప్రచారం జరిగింది. అందుకే 'ధాకడ్‌' పరాజయం పొందింది. కొందరు చిల్లర వ్యక్తులు కావాలనే ఈ సినిమాపై నెగెటివ్‌ ప్రచారం చేశారు. నిర్మాత ఆస్తులు అమ్ముకున్నారనే వార్తల్లో నిజం లేదు. దీపక్‌ ముకుత్‌ పాజిటివ్‌గానే ఉన్నారు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ చిత్రంపై ఇప్పటికీ వందలాదిగా తప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయన్న ఆమె.. ఇలాంటి వాటివల్లే సినిమా ఫ్లాప్ అయిందని వాపోయింది.

Advertisement

Next Story