- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KA Paul: ఇక ఢిల్లీలోనే తేల్చుకుంటా.. మోడీపై యాక్షన్ ప్లాన్ ప్రకటించిన కేఏపాల్
దిశ, వెబ్‌డెస్క్: KA Paul Says, He Will Fight At Delhi to Solve State Bifurcation Guarantees| తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సత్తా చాటుతానని ధీమాతో ఉన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరో సంచలన ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని విభజన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుంటే ఢిల్లీలోనే తాడోపేడో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలోని రాజ్ ఘాట్‌ను సందర్శించిన కేఏ పాల్ తెలుగు రాష్ట్రాల విభజన హామీల అమలు కోసం రాజ్ ఘాట్‌లో మౌన దీక్షకు దిగారు. 8 ఏళ్లుగా విభజన హామీలను కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకపోవడంతోనే తాను నేడు దీక్షకు దిగానని.. త్వరలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తానని వెల్లడించారు.
నిరవధిక నిరాహార దీక్షకు ప్లాన్:
తెలుగు రాష్ట్రాల సమస్యలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని కేఏ పాల్ విమర్శించారు. తాను జీవితంలో మొట్ట మొదటి సారిగా రాజ్ ఘాట్‌లో మూడు గంటల పాటు మౌన దీక్ష చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన హామీల అమలు కోసం జులై 20న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జంతర్ మంతర్ వద్ద రీలే నిరాహారదీక్ష చేపడతామని తెలిపారు. ఆగస్ట్ 15కు ముందు సమస్యలపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అప్పటి వరకు సమస్యలు పరిష్కరించకుంటే ఆగస్టు 15 తర్వాత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలనే యోచనతో ఉన్నానని అన్నారు. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి రాజకీయ ఎజెండాలు, ప్రాంతీయ అడ్డంకులు పక్కన పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10 లక్షల మంది కలిసి రావాలని పిలుపునిచ్చారు.
కేఏ పాల్ డిమాండ్లు ఇవే:
తెలుగు సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావని, తనతో చేతులుకలపాలని కేఏ పాల్ సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు కేఏ పాల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు వేరువేరు డిమాండ్లను తెరపైకి తీసుకువచ్చారు.
తెలంగాణ డిమాండ్:
= బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం
= ఇండస్ట్రీయల్ కారిడార్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
= IITలు, IIMలు మరియు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు
= పాలమూరు రంగారెడ్డి నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా
ఆంధ్రప్రదేశ్ కోసం డిమాండ్లు:
= ప్రత్యేక హోదా
= రైల్వే జోన్ ఏర్పాటు
= వైజాగ్‌కు ఆర్థిక బలం అందించేలా చర్యలు
=వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి పెట్టుబడుల ఉపసంహరణ రద్దు
= సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల
ఇది కూడా చదవండి: CM సొంత నియోజక వర్గం.. ఈటల సమక్షంలో BJPలో చేరిన TRS నాయకులు
- Tags
- KA Paul