ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు సీరియస్‌

by karthikeya |
ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు సీరియస్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ నెల 5 నుంచి నిబంధనలను కఠినతరం చేశారు. టూవిల్లర్ బయటకు తీస్తే మస్ట్‌గా హెల్మెట్ వాడాల్సిందేనని కండీషన్ పెట్టారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే ప్రస్తుతం ఉన్న రూ.100 జరిమానాను రూ.200కు పెంచారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపితే ప్రస్తుతం ఉన్న రూ.1,000 ఫైన్‌ను రూ.2,000 పెంచారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ హెచ్చరించారు. ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించక పోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణ కోసమే నిబంధనలను కఠినతరం చేశామని, దీని కోసం ఎక్కువగా స్పెషల్ డ్రైవ్‌లు చేపడతామని వెల్లడించారు.

రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడంపై గత నెల 28న హైకోర్టు సీరియస్ అయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో బడా బాబులు సంపాదిస్తుంటే వారి పిల్లలు తాగి జల్సాలు చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్‌ల విషయంలో నిబంధనలు కఠినతరం చేయాలని, వాటి ఎదుట డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించాలని పోలీసులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే హెల్మెట్ తప్పనిసరి రూల్ అమల్లోకి తెచ్చినట్టు సీసీ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed