- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BC Gurukulam : బీసీ గురుకులం.. దయనీయం..
దిశ, అబ్దుల్లాపూర్మెట్ : రాష్ట్రంలో ఉన్న బీసీ గురుకులాల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. కుటుంబ సభ్యులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పిల్లలకు విద్యాభద్రత, ఆరోగ్య భద్రత, ఆహార భద్రత ఉండేదని.. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు బంగారు భవిష్యత్ ఉంటుందనే భరోసాతో విద్యార్థుల కుటుంబ సభ్యులు ఉండేవారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఈ పాఠశాలలు తయారయ్యాయి. ఈ పాఠశాలల్లో సీట్లు కావాలంటే ఎమ్మెల్యే లు, ఎంపీలు, మంత్రుల సిఫారసులు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్నది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన బోధకులు విద్యార్థులను గాలికి వదిలేస్తున్నారు. బీసీ గురుకులాల్లో విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని విద్యార్థులే ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు కూడా చేస్తున్నారంటే వారి సమస్య ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. రాగిజావలో పురుగులు, ఉడకని అన్నం.. అందులో రాళ్లు.. రప్పలు వస్తున్నాయని స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. మరుగుదొడ్లయితే మరీ దారుణంగా ఉంటాయని.. అందులోకి వెళితేనే కంపుకొడుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా, ఎక్కడైనా ఫిర్యాదులు చేస్తే టీసీ ఇచ్చి ఇంటి పంపిస్తామని బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలున్నాయి.
రోడ్లపైకి వచ్చి ఆందోళనలు..
ఎంజేపీఎస్ చార్మినార్, ముషీరాబాద్‌కు చెందిన బీసీ గురుకుల రెసిడెన్షియల్ రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో ఉంది. విద్యార్థులు సమస్యలతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రదాహరి పై ఆందోళన చేపట్టారు. హాస్టల్లో మాకు పెట్టే రాగిజావలో పురుగులుంటున్నాయని విద్యార్థులు స్వయంగా తెలిపారు. అదే విధంగా అన్నంలోరాళ్లు, రప్పలుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నా సీనియర్లే చేయిస్తున్నారని అనుమానంతో మమ్మల్ని బెదిరిస్తున్నారని.. ఘటనను బట్టి కొడుతున్నారని స్టూడెంట్స్ వాపోయారు. ఏ విషయం పై కానీ ఎవరిపై నైనా ఫిర్యాదులు చేస్తే దారుణంగా చితకబాదుతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. బీసీ గరుకుల విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన హాస్టల్ అధికారులను వివరణ కోరగా.. స్పెషల్ ఆఫీసర్ నారాయణరెడ్డి వివరణ ఇచ్చారు. కొంత మంది విద్యార్థుల అత్యుత్సాహం వల్లే మిగతా విద్యార్థులు సైతం తప్పుదోవ పట్టేలా ప్రవరిస్తున్నారన్నారు.
హాస్టల్ సిబ్బంది ఏం చేస్తున్నట్లు..!
బీసీ గురుకులాలకు చెందిన హాస్టల్ బాటసింగారం ఓ ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన కళాశాలను లీజుకు తీసుకొని నిర్వహిస్తున్నారు. మజీద్పూర్ గ్రామ రెవెన్యూ పరిధి అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఆ హాస్టల్ భవనానికి కంపౌండ్ కూడాలేదు. అక్కడ నుంచి రాత్రి సమయంలో విద్యార్థులు బయటకు వెళ్లి పటాకులు తెచ్చి.. కాల్చేవరకు అక్కడి హాస్టల్ సిబ్బంది ఏం చేస్తున్నారని విద్యార్థుల కుటుంబసభ్యులు కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదే కాకుండా ఆందోళన చేసిన విద్యార్థులు దాదాపు 50 - 60 మంది ఉంటారని, అంత మంది బయటకు వెళ్తుంటే అధికారులు, సిబ్బంది ఏం చేసినట్లు అని పలువురు వాపోతున్నారు. అసలే ఈ ప్రాంతం అడవిలా ఉంటుంది. వాళ్లు బయటకు వెళ్లే సమయంలో ఏమైనా జరగకూడని ఘటన జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.
శిథిలావస్థలో హాస్టల్ బిల్డింగ్..!
ఎంజేపీఎస్ చార్మినార్, ముషీరాబాద్ చెందిన బీసీ గురుకుల రెసిడెన్షియల్ బిల్డింగ్ చాలా పురాతమైనది. ఆ హాస్టల్ భవనానికి ఉన్న కిటికీలకు అద్దాలు లేకపోవడంతో కవర్ బస్తాను చుట్టారు. భవనం బయట నుంచి చూస్తే పెచ్చులూడుతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో లీజ్ తీసుకొని.. ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు. భవనం నిర్మించిన క్రమంలో పిల్లర్ల కింద పోసిన మట్టి కుంగిపోతున్నది. అసలు ఆ దృశ్యాన్నైనా హాస్టల్ సిబ్బంది పసిగట్టిందో లేదో తెలియదు. హాస్టల్ భవనం చుట్టూ ఉన్న ఏ ఒక్క కిటికీగానీ, అద్దాలు సరిగా లేకపోవడం ఆశ్చర్యం కలుగుతున్నది. అసలే చలికాలం ఎలా ఉంటున్నారో అందులో మరి..!