- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kanguva: ఆ అరగంట నిజంగా బాగోలేదు కానీ.. ‘కంగువ’పై జ్యోతిక రివ్యూ
దిశ, సినిమా: తమిళ స్టార్ సూర్య (Tamil Star Surya) నటించిన తాజా చిత్రం ‘కంగువ’ (Kanguva). ప్రముఖ డైరెక్టర్ శివ (Director Shiva) దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అలాగే ప్రజెంట్ ఈ మూవీ బాక్సాఫీస్ (box office) వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. అయితే.. కొన్ని చోట్ల మాత్రం నెగిటివ్ రివ్యూ (Negative Review)లతో పోస్టులు పెడుతున్నారు. దీనిపై తాజాగా సూర్య సతీమణి జ్యోతిక (Jyotika) స్పందిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు.
‘కంగువ.. అద్భుతమైన చిత్రం. సూర్య నటన విషయంలో ఎంతో గర్వంగా ఉన్నాను. నిజమే మొదటి అరగంట అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోవచ్చు. అయితే.. చిత్రాల్లో లోపాలు ఉండటం సహజం. అదే విధంగా ఇలాంటి ప్రయోగత్మక చిత్రాల్లో అలాంటి చిన్న లోపాలు ఉండటంలో తప్పు లేదు. కానీ, మూడు గంటల సినిమాను మొదటి అరగంట చూసి అంచన వేయడం నిజంగా తప్పు. నిజం చెబుతున్నా.. ఇదొక అద్భుత సినిమాటిక్ అనుభూతిని అందించింది. ఈ మూవీకి వస్తున్న నెగిటివ్ రివ్యూలు చూసి షాక్ అయ్యాను. గతంలో రిలీజైన భారీ బడ్జెట్ చిత్రాల్లో మహిళలను తక్కువ చేసేలా డైలాగ్స్ ఉన్నా, సన్నివేశాలు బాగోకపోయినా ఇలాంటి రివ్యూలు చూడలేదు. భారీ యాక్షన్ సన్నివేశాలు, సెకండాఫ్‌లో మహిళలపై చిత్రీకరించిన ఫైట్ సీన్స్, కంగువాపై చిన్నారి ప్రేమ గురించి ఎవరూ మాట్లాడంటం లేదు. నాకు తెలిసి రివ్యూ చేసే సమయంలో పాజిటివ్స్ మరిచిపోయినట్లు ఉన్నారు. విడుదలైన తొలి రోజు నుంచి ఇంత నెగిటివిటీని చూడటం బాధగా ఉంది. అద్భుతమైన దృశ్యాన్ని రూపొందించడానికి బృందం ఎంచుకున్న కాన్సెప్ట్, ప్రయత్నానికి ప్రశంసలు దక్కాలి’ అంటూ చెప్పుకొస్తూ.. ఓ సినిమా అభిమానిగా నేను ఈ రివ్యూ ఇస్తున్న అని జ్యోతిక తెలిపారు.