- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి దారుణ హత్య..!
దిశ, అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బైరాపురం శివారులోని అలంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని ఉండవల్లి పోలీసులు ముందుగా చేరుకుని పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తి ఒంటి పై బట్టలు లేకపోవడం, ముఖం గుర్తించలేని విధంగా ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఉదయం 11 గంటలకు గద్వాల్ డీఎస్పీ సత్యనారాయణ స్థలాన్ని పరిశీలించారు.
హత్యకు గురైన వ్యక్తి వంటి పై తెల్లని బనియన్ ఒక్కటే ఉంది. లెఫ్ట్ హ్యాండ్ వేలికి వెండి ఉంగరం, బనియన్ పై రామరాజ్ ఉన్న ఆనవాళ్లను గుర్తించారు. హత్యకు గురైన వ్యక్తి ఏపీ రాష్ట్రం కర్నూలు జిల్లా వాసి ఉండవచ్చునని అందాజా 45 నుండి 50 మధ్య వయస్సు ఉండవచ్చునన్నారు. గుర్తు తెలియని వ్యక్తి కావడంతో సంఘటన స్థలానికి డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీం రప్పించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం అలంపూరులోని మార్చరీకి తరలించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్సై సుబ్బారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.