- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం జియో-బీపీ, టీవీఎస్ మోటార్ భాగస్వామ్యం!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీల సంయుక్త సంస్థ రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ (ఆర్‌బీఎంఎల్), టీవీఎస్ మోటార్ కంపెనీలు కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఈ ఒప్పందం ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రీ-వీలర్ల కోసం మెరుగైన పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ భాగస్వామ్యం కింద టీవీఎస్ ఈవీ వినియోగదారులు జియో-బీపీ ఛార్జింగ్ నెట్‌వర్క్ సౌకర్యాలను పొందుతారని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి.
ప్రధానంగా ఈవీల కోసం సాధారణ ఏసీ ఛార్జింగ్ నెట్‌వర్క్‌తో పాటు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వినియోగదారులకు అందించడమే ఈ భాగస్వామ్యం లక్ష్యమని, అంతేకాకుండా గ్లోబల్ మార్కెట్ల స్థాయిలో వినియోగదారులకు మెరుగైన ఈవీ సౌకర్యాలను దేశీయ మార్కెట్లో అందించడానికి ఈ ఒప్పందం ద్వారా వీలవుతుందని కంపెనీలు పేర్కొన్నాయి. జియో-బీపీ బ్రాండ్ ఈవీ ఛార్జింగ్, స్వాపింగ్ స్టేషన్లను నిర్వహిస్తోంది. భారత అతిపెద్ద ఈవీ నెట్‌వర్క్‌గా ఉండాలనే లక్ష్యంతో ఉన్న ఈ కంపెనీ, తమ వినియోగదారులు ఛార్జింగ్ స్టేషన్‌ను సులభంగా గుర్తించే విధంగా సౌకర్యాలను అందిస్తోంది.
మరోవైపు టీవీఎస్ మోటార్ కంపెనీ తన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ 12 వేల యూనిట్లను విక్రయించింది. ఈవీలను కావాలనుకునే వినియోగదారుల కోసం ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని, ఛార్జింగ్ స్టేషన్లు వేగవంతంగా విస్తరించడం వల్ల మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది.