- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జక్కిడి vs మల్‌రెడ్డి.. ఆ నియోజక వర్గ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్..
దిశ, ఎల్బీనగర్ : ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తరుఫున గెలుపొందిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కారెక్కడంతో ఈ సారి టికెట్ ఎవరికి దక్కుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఎల్బీనగర్ మన్సూరాబాద్‌కు చెందిన టీపీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డిల మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం అది పీక్ స్టేజీకి చేరుకుంది. సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా గుడువు ఉన్నప్పటికీ జక్కిడి, మల్‌రెడ్డిలు మాత్రం ఒకరిపై మరొకరు ఎత్తుకు పైఎత్తులు వేయడం.. ప్రజలతో మమేకమవుతూ.. పోటాపోటీ కార్యక్రమాలను నిర్వహిస్తూ పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నారు.
ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల దూకుడుతో నియోజకవర్గంలో ఎన్నికల సందడి తలపిస్తోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా సుధీర్‌రెడ్డి గెలుపొందాడు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించాలని జక్కిడి ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గంలో హడావిడి చేస్తున్నారని టాక్ నడుస్తోంది. జక్కిడి దూకుడుకు బ్రేక్ వేసేందుకు మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పార్టీ అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి మధ్య నువ్వా..నేనా.. అన్న పరిస్థితి నెలకొంది.
మాజీ ఎమ్మెల్యే రహస్య మంతనాలు..!
ఎల్బీనగర్‌లో జక్కిడికి కళ్లెం వేయాలని మల్‌రెడ్డి రంగారెడ్డి పావులు కదుపుతున్నారు. తన తమ్ముడికి ఎలాగైనా ఎల్బీనగర్ టికెట్ దక్కెలా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇటీవల తనకు అనుకూలమైన నేతలతో శివారులోని ఫామ్‌హౌజ్‌లో రహస్య మంతనాలు జరిపినట్లు సమాచారం. తమ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే జక్కిడి తమకు వ్యతిరేక వర్గాన్ని తయారు చేస్తున్నాడని, ఈ చర్యలను ఎలాగైనా తిప్పికొట్టాలని నేతలకు మల్‌రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కొందరు రాష్ట్రస్థాయి నేతలు కూడా పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారంతా మల్‌రెడ్డికి మద్దతు తెలియజేస్తూ.. అవసరమైతే జక్కిడి వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని మాజీ ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.
క్యాడర్‌లో అయోమయం..?
ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలతో ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. నియోజకవర్గంలో జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డిలు రెండు వర్గాలుగా చీలి కార్యక్రమాలు నిర్వహిస్తుడడంతో పార్టీ క్యాడర్ ఎవరితో వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఒకే పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోవడం పార్టీకే నష్టమని పార్టీ కార్యకర్తులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మల్‌రెడ్డి రాంరెడ్డి స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి కోవర్టని, రాంరెడ్డికి టికెట్ ఇస్తే టీఆర్ఎస్‌కే లాభమని కొందరు కాంగ్రెస్ నేతలే భాహాటంగా చర్చించుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందో తెలియక క్యాడర్ కన్ఫూజన్‌కు గురవుతున్నారు. క్యాడర్‌లో నెలకొన్న కన్ఫూజన్‌కు టీపీసీసీ చీఫ్ రెవంత్‌రెడ్డి ఏ విధంగా చెక్ పెడతారో వేచిచూడాలి.