- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పేస్ సైన్స్ ప్రోగ్రామ్.. గ్రామీణ విద్యార్థులకు ఇస్రో ఆహ్వానం!
దిశ, ఫీచర్స్ : యువ విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు స్పేస్ సైన్స్, స్పేస్ అప్లికేషన్స్, అంతరిక్ష సాంకేతికతపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో 'యువ విజ్ఞాన కార్యక్రమ్'(యువికా) పేరుతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) ఆధారిత పరిశోధన/కెరీర్‌లను అభ్యసించేందుకు ఎక్కువ మంది విద్యార్థులను ప్రోత్సహించే వేదికను రూపొందించాలని కూడా ఇది భావిస్తోంది. అయితే ఈ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ కోసం విద్యార్థుల నుంచి అప్లికేషన్స్ ఆహ్వానిస్తుండగా అందుకు తగిన అర్హతలు తెలుసుకుందాం.
సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్న పోకడల గురించి పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న YUVIKA 2022 ప్రోగ్రామ్ రెండు వారాల పాటు జరిగే రెసిడెన్షియల్ కార్యక్రమం. కాగా 2022 మార్చి 1 నాటికి 9వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకోసం ధరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా ఉంటుంది?
* ప్రముఖ శాస్త్రవేత్తలు విద్యార్థులతో తమ అనుభవాన్ని పంచుకుంటారు. విద్యార్థుల సందేహాలను, ప్రశ్నలను నివృత్తి చేయడంతో పాటు, వారితో ఇంటారాక్షన్ సెషన్స్‌లో పాల్గొంటారు.
* ఎక్స్‌పరిమెంటల్ డెమాన్‌స్ట్రేషన్, ల్యాబ్ విజిట్స్, నిపుణులతో చర్చలు, ప్రాక్టికల్ సహా ఫీడ్‌బ్యాక్ సెషన్స్ ఉంటాయి.
* దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతదేశ భూభాగంలో ఉన్న పాఠశాల విద్యార్థులై ఉండాలి. ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం నుంచి మొత్తంగా 150 మంది విద్యార్థుల్ని ఎంపిక చేస్తారు.
* 8వ తరగతిలో పొందిన మార్కులు, సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనడం, స్కౌట్, గైడ్స్/ NCC/ NSSలో సభ్యత్వం, సైన్స్ పోటీలలో విజయం, ఆన్‌లైన్ క్విజ్ వంటి అంశాలతో పాటు గత మూడేళ్లలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* పంచాయతీ పరిధిలో ఉన్న పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తారు.
* కార్యక్రమం పూర్తయిన తర్వాత విద్యార్థులను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించేందుకు తీసుకువెళతారు.
* ప్రయాణం, బస, బోర్డింగ్‌తో సహా అన్ని ఖర్చులను ఇస్రో భరిస్తుంది.
* ఒక పేరెంట్/గార్డియన్‌కు ప్రయాణ చార్జీ కూడా అందిస్తారు.
* కార్యక్రమం 16 నుంచి 28 మే 2022 మధ్య జరుగుతుంది.
ఎలా దరఖాస్తు చేయాలి:
* అఫిషియల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసిన 48 గంటలలోపు ఆన్‌లైన్ క్విజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
* 60 నిమిషాల క్విజ్ పూర్తయిన తర్వాత, YUVIKA పోర్టల్‌కి లాగిన్ చేసి, అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయాలి.
* ప్రోగ్రామ్ కోసం ఇస్రో అడిగిన అన్ని పత్రాలను చివరి తేదీలోపు అప్‌లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
మార్చి 10 , ఉదయం 10.30 నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా ఏప్రిల్ 10, సాయంత్రం నాలుగు గంటల లోపు సమర్పించాలి. ఏప్రిల్ 20వ తేదీన
తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటిస్తుంది. మరిన్ని వివరాల కోసం, అధికారిక వెబ్‌సైట్ [email protected] సందర్శించండి.