- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
లోగో రిలీజ్ చేసిన గుజరాత్ టైటాన్స్!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 సీజన్‌లో ఈ ఏడాది 10 జట్లు సందడి చేయనున్న విషయం తెలిసిందే. కొత్తగా లక్నో సూపర్ జాయంట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈ ఏడాది 15వ సీజన్లో క్రికెట్ అభిమానులను అలరించనున్నాయి. ఇప్పటికే ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తయింది. గుజరాత్ జట్టుకు మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా కోచ్‌గా వ్యవహరిస్తుండగా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఈ నేపథ్యంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్ జట్టు తమ లోగోను మెటావర్స్‌లో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మెటావర్స్‌లో లోగోను విడుదల చేసిన మొదటి భారతీయ క్రీడా జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఈ వీడియోలో ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ ఒకరితో ఒకరు మాట్లాడుకున్న ఆసక్తికరమైన వీడియోను ఫ్రాంఛైజీ విడుదల చేసింది. కాగా, మొత్తం 23 మంది స్క్వాడ్‌తో గుజరాత్ జట్టు ఈసారి ఏపీఎల్ సీజన్‌లో ఆరంగ్రేట్రం చేయనుంది.