- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'వెల్‌మీ.. నో పెయిన్ పీరియడ్!
దిశ, ఫీచర్స్ : 'పీరియడ్స్' మాట వింటే చాలు.. అదేదో అపచారం, అపనిందలా భావిస్తుంటారు. లోకం సంగతి పక్కన పెడితే.. ఇంట్లోనే 'ఆమె'కు సవాలక్ష ఆంక్షలు. ప్రతి పుట్టుకకు మూలమైన 'నెలసరి'ని తప్పుపట్టడాన్ని తప్పుగా భావించకపోవడమే దీనికి కారణం. సహజసిద్ధంగా మహిళల్లో కలిగే శారీరక మార్పులకు ఇన్ని ఆంక్షలు విధించడం కచ్చితంగా వివక్ష అని తెలుసుకునే విజ్ఞత లేకపోవడమే ఇందుకు మూలం. ఇక 'బహిష్టు' వేళ మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులపై సమాజంలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతుండగా ఇంకా మార్పు రావాల్సి ఉంది. ఏదేమైనా ప్రతీ నెల, ప్రతీ మహిళ ఓ విస్ఫోటనాన్ని అనుభవించడమైతే నిజం. ప్రసవాన్ని తలపిస్తూ తెరలు తెరలుగా వచ్చే ఆ పెయిన్ తట్టుకోవడం మామూలు విషయమైతే కాదు. కాగా లోలోపల మెలిపెట్టే ఆ నొప్పి నుంచి స్త్రీలకు విముక్తి కల్పించే పరికరమే 'వెల్‌మీ'. ఇంతకీ ఈ డివైజ్ ఎలా పనిచేస్తుంది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
అనారోగ్యకర ఆహారపు అలవాట్లు సహా గంటల తరబడి కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం, విరామంలేని పనితో ఒత్తిడి ఎదుర్కోవడం వంటి కారణాలతో ఆరోగ్యం పాడవుతుంది. ఈ తరహా జీవన శైలి అనేక వ్యాధులతో పాటు ఊబకాయం లేదా వివిధ రకాల శారీరక నొప్పులకు దారితీస్తుంది. విముక్తి కోసం వైద్య చికిత్స లేదా వాళ్లు సూచించిన మెడిసన్‌పైనే ఆధారపడాలి. అయితే ఇలాంటి నొప్పుల నుంచి ఉపశమనం అందించేందుకు అహ్మదాబాద్‌కు చెందిన ప్రేక్ష తన భర్త రాహుల్‌తో కలిసి 'కామెక్స్ వెల్‌నెస్ లిమిటెడ్' పేరుతో 2009లో హెల్త్‌టెక్ స్టార్టప్ ప్రారంభించింది.
తొలి అడుగులు :
'ట్రాన్స్‌క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నెర్వ్ స్టిమ్యులేషన్(TENS)' అనే సాంకేతికతతో తేలికపాటి ఎలక్ట్రికల్ కరెంట్‌ను ఉపయోగించడం ద్వారా నొప్పిని తగ్గించే ప్యాడ్స్ తయారుచేశారు ప్రేక్ష, రాహుల్. ఈ టెక్నాలజీ ఉపయోగించుకుని మోకాలి టెన్స్ పరికరం, బ్యాక్ టెన్స్ పరికరాన్ని అభివృద్ధి చేయగా.. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజంగా పెయిన్ రిలీఫ్ అందించే ఈ ఉత్పత్తులు మార్కెట్‌లో మంచి రెస్పా్న్స్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే మానవ శరీరంలో ఏ రకమైన నొప్పికైనా TENS థెరపీ అద్భుతాలు చేయగలదని, ఇప్పటికే ఇతర దేశాల్లోని అనేక కంపెనీలు మెన్‌స్ట్రువల్ పెయిన్ నివారణ కోసం 'టెన్స్' ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నాయని తమ పరిశోధనలో తేలింది. దీంతో పీరియడ్స్ క్రాంప్స్ బాధలు తొలగించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగించాలనుకున్న ప్రేక్ష.. తద్వారా భారతదేశపు మొదటి పీరియడ్ పెయిన్ రిలీఫ్ డిజైన్ అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. స్త్రీలకు పీరియడ్స్ క్రాంప్స్‌లో సౌఖ్యాన్ని అందించేందుకు తయారుచేసిన ఈ పరికరాన్ని శాస్త్రీయంగా 'డిస్మెనోరియా' అని కూడా పిలుస్తారు.
రీసెర్చ్ అండ్ ట్రయల్:
ప్రేక్ష.. తమ ప్రొడక్ట్ డిజైనర్స్, ఫిజియోథెరపిస్ట్, ఎలక్ట్రానిక్స్ నిపుణులు సహా డేటా సైంటిస్ట్‌ల బృందంతో కలిసి 'వెల్ మీ'ని అభివృద్ధి చేసింది. ఇది భారతదేశంలో శాస్త్రీయంగా నిరూపించబడిన మొట్టమొదటి పెయిన్ రిలీఫ్ డివైజ్ అని వెల్‌మీ టీమ్ పేర్కొంది. ఆ తర్వాత బెంగళూరులోని పీపుల్ ట్రీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఊర్వాన్షి బాత్రా ద్వారా క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించారు. ఈ మేరకు 18-35 ఏళ్ల మధ్య వయసు గల 60 మంది మహిళా రోగులపై అధ్యయనం నిర్వహించగా, వెల్‌మీకి పాజిటివ్ స్పందన వచ్చింది.
పనితీరు :
Welme అనేది ఒక ఇన్‌స్టంట్ పీరియడ్ పెయిన్ రిలీఫ్ పరికరం. ఇది వేరబుల్ డివైజ్, ప్యాకెట్ ఫ్రెండ్లీ ఉత్పత్తి కాగా సులభంగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. కిట్‌లోని సులభమైన సూచనలు ప్యాడ్స్‌ను ఎలా వాడాలో చూపించేందుకు సాయపడతాయి. ప్యాడ్స్ శరీరానికి అమర్చుకున్న తర్వాత, పరికరాన్ని ఆన్ చేయొచ్చు. ముందుగా అత్యల్ప సెట్టింగ్‌తో ప్రారంభించి క్రమంగా తీవ్రతను పెంచుకోవచ్చు. కంఫర్టబుల్ సెట్టింగ్‌ను కనుగొన్న తర్వాత, రోజంతా పరికరాన్ని ఉపయోగించవచ్చు. టెన్స్ డివైజ్‌లో అంతర్నిర్మిత టైమర్ ఉండటం వల్ల మితిమీరిన వినియోగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరముండదు. వెల్‌మీ చార్జబుల్ డివైజ్ కాగా దీన్ని USB పోర్ట్ లేదా స్టాండర్డ్ అవుట్‌లెట్‌లో ప్లగ్ చేయొచ్చు. జనవరిలో మార్కెట్‌లోకి వచ్చిన ఈ పరికరం ధర రూ. 2,999 కాగా UK, ఫ్రాన్స్, స్పెయిన్ సహా 12 దేశాలకు సైతం ఎగుమతి చేస్తుండటం విశేషం.
'మా డిజైన్ బృందం TENS స్మార్ట్ టెక్నాలజీని పాకెట్-సైజ్ ఉత్పత్తిలో చేర్చగలిగింది. ఔషధ రహిత సాంకేతికత గల TENSను ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా నొప్పి నుంచి విముక్తి పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఈ స్మార్ట్ టెన్స్ టెక్నాలజీ నుంచి వచ్చే విద్యుత్ ప్రేరణలు నొప్పి సంకేతాలను నిరోధించి, మెదడుకు చేరకుండా నిరోధిస్తాయి. ఇక వెల్‌మీ విషయానికొస్తే.. ఈ డివైజ్‌ను నేను స్వయంగా ప్రయత్నించాను. సానుకూల ఫలితాలను అనుభవించిన తర్వాత, కొత్తగా అభివృద్ధి చేసిన ఈ పరికరాన్ని నా స్నేహితులు, కుటుంబ సభ్యులు సహా సహోద్యోగులకు అందించాను. ప్రస్తుతం ఇది విప్లవాత్మక వెల్‌నెస్ ఉత్పత్తిగా మారింది. మహిళలు తమ రోజువారీ కార్యకలాపాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా - పీరియడ్స్ లేదా పీరియడ్స్ నొప్పి లేకుండా నిర్వహించేందుకు ఇది తప్పకుండా తోడ్పడుతుంది.
- ప్రేక్ష