- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రవీంద్రభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
దిశ, బోథ్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వారోత్సవ వేడుకలను హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించారు. ఇట్టి వేడుకకు రాష్ట్ర గిరిజన మరియు మహిళా సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్, విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి కమిషనర్ దివ్య దేవరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సత్కరించి అవార్డులు అందించారు. అనంతరం మహిళల ఫిర్యాదులకై కొత్తగా వాట్సాప్ టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రారంభించారు. అనంతరం సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ చేసిన పనులను వివరించారు. ఈశ్వరీబాయిని మంత్రులు శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ నుండి మహిళా కమిషన్ సభ్యురాలిగా కొనసాగుతున్న కుమ్ర ఈశ్వరీ బాయి వారోత్సవాల్లో పాల్గొన్నారు.