తెలంగాణ, కర్ణాటక మంత్రుల మధ్య చర్చ.. ఆసక్తికరంగా ట్వీట్‌లు

by Javid Pasha |
తెలంగాణ, కర్ణాటక మంత్రుల మధ్య చర్చ.. ఆసక్తికరంగా ట్వీట్‌లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్ కర్ణాటక పీసిసి ప్రెసిడెంట్ డీకే శివకుమార్ మధ్య సోమవారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర చర్చ సాగింది. ఐటీ రంగంలో బెంగళూరుకు హైదరాబాద్ పోటీ చేయనివ్వండి. ఇన్‌ఫ్రా, ఐటీ, బీటీపై దృష్టి పెడదామని కోరారు. 'మంత్రి కేటీఆర్..అన్నా, కర్ణాటక రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు. అక్కడ ఎవరు గెలుస్తారో కూడా తెలీదు. కానీ సవాల్ అంగీకరించడం జరిగింది. అయితే ఉద్యోగాలు కల్పించడంలో ఇ హైదరాబాద్ & బెంగళూరు పోటీ మధ్య ఆరోగ్యవంతమైన పోటీ చేయనివ్వండి. అంతేకాకుండా మన దేశం శ్రేయస్సు కోసం మన యువకులకు ఉద్యోగాలు కల్పించండి. అయితే ప్రస్తుతానికి దేశంలో ఉన్న ఇన్‌ఫ్రా, IT&BT, హలాల్ & హిజాబ్ సమస్యలపై దృష్టి సారిద్దాం' అని అన్నారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌కు డీకే శివకుమార్ రిప్లై ఇచ్చారు. 'నా మిత్రమా, నేను మీ సవాలును అంగీకరిస్తున్నాను. 2023 చివరి నాటికి, కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంతో, మేము భారతదేశపు అత్యుత్తమ నగరంగా బెంగళూరు కీర్తిని పునరుద్ధరిస్తాము' అని బదులిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed