వాటి వల్లే బాల్య వివాహాలు తగ్గాయన్న టీఆర్ఎస్ నేత.. నెటిజన్ల కామెంట్స్ వైరల్

by GSrikanth |
వాటి వల్లే బాల్య వివాహాలు తగ్గాయన్న టీఆర్ఎస్ నేత.. నెటిజన్ల కామెంట్స్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించి జనాభాతో పాటు, పునరుత్పత్తి, పిల్లల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పోషణ ఇతర అంశాలపై సర్వే నిర్వహించి జాతీయ కుంటుంబ సర్వేను విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్-5 సర్వేనే కేంద్రం రిలీజ్ చేసింది. అయితే, గతంతో పోల్చితే.. తెలంగాణ రాష్ట్రంలో బాల్య వివాహాలు సంఖ్య తగ్గాయని వెల్లడించింది. ఎన్ఎఫ్‌హెచ్ఎస్-4 సర్వే ప్రకారం 26.8శాతం ఉన్న బాల్య వివాహాలు, తాజా సర్వేతో 23.3 శాతం నమోదయ్యాయి. దీంతో 3.5 శాతం బాల్య వివాహాలు తగ్గాయి. అయితే, దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కల్యాణ లక్ష్మీ పథకమే కారణమని, పేదింటి వివాహాలకు ప్రభుత్వం సాయం చేస్తున్నందునే బాల్య వివాహాల రేటు తగ్గిందని టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే, ప్రతిపక్షాలు, నెటిజన్లు మాత్రం పథకాలకు బాల్య వివాహాలకు సంబంధం ఏంటని, మారుతున్న సాంకేతికత, పెరిగిన విద్యాభ్యాసం వళ్లనే, మహిళా సాధికారత వల్లనే ఇది సాధ్యమైందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed