- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Karuna Kumar:‘మన దగ్గర వాటిని మించిన కథనాలున్నాయి’.. ప్రముఖ దర్శకుడు సంచలన కామెంట్స్
దిశ,వెబ్‌డెస్క్: మొదటి చిత్రంతోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను దక్కించుకున్నారు ప్రముఖ దర్శకుడు కరుణ కుమార్(director Karuna Kumar). ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం మట్కా(Matka). మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా వస్తోన్న ఈ పీరియాడిక్ సినిమా ఈ నెల(నవంబరు)22 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ కరుణకుమార్ మంగళవారం హైదరబాదులో విలేకర్లతో మాట్లాడారు. సినిమా అనేది కళను నమ్మే ఓ బిజినెస్ అని అన్నారు. స్టోరీ పరంగా చూసుకుంటే నేనేమీ అంతా టాలెంట్ కాదని నిజాయితీగా చెబుతాను అని వెల్లడించారు.
అయితే తెలుగు మూవీస్ వేరే భాషల చిత్రాలు బాగుంటాయని ఎన్నో కంప్లైంట్స్ విన్నానని అన్నారు. కానీ వాస్తవానికి మనం తెరకెక్కించిన సినిమాలు ఎవ్వరూ ఇంతవరకు తీయలేదని తెలిపారు. పాతాళ భైరవి(Patala Bhairavi), మాయాబజార్(Mayabazar) వంటి గొప్ప గొప్ సినిమాలను మనవాళ్లే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారని తెలుగు చిత్రాల్ని కొనియాడారు. అలాగే బెంగాలీ(Bengali) తర్వాత మంచి సాహిత్యం మన తెలుగులోనే కదా ఉంది అన్నారు. వేరే భాషల్లో స్టోరీలు మూలాల్ని ఆవిష్కరిస్తున్నాయని అంటుంటారు. కానీ వాటిని మించి కథలు మనదగ్గరున్నాయని డైరెక్టర్ కరుణ కుమారు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ దర్శకుడి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.