తొలి సంభోగం తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్‌కి ఇలా చెక్ పెట్టండి?

by Manoj |
తొలి సంభోగం తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్‌కి ఇలా చెక్ పెట్టండి?
X

దిశ, ఫీచర్స్ : కొత్త జంటలకు హనీమూన్ అంటే కాస్తా హుషారు ఉంటుంది. ప్రైవసీ అండ్ ఎంజాయ్‌మెంట్‌తో పాటు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ఈ టైమ్ సహాయపడుతుందని అనుకుంటారు. కానీ హనీమూన్ కూడా ఒక్కోసారి ఇబ్బందులు కలిగిస్తుందంటున్నారు నిపుణులు. స్టీమీ సెక్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో.. 'హనీమూన్ సిస్టిటిస్' డెవలప్ అయితే సమస్యాత్మకంగా మారుతుందని చెప్తున్నారు. తొలి సారి సంభోగం, చాలా కాలం తర్వాత ఇంటర్‌కోర్స్ ద్వారా సంభవించే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ 'హనీమూన్ సిస్టిటిస్' కాగా.. ఇది మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. తద్వారా మనసుతో పాటు శరీరానికి బాధ కలిగిస్తుంది.

ఎందుకు జరుగుతుంది?

స్త్రీ శరీరంలో ఆనల్ ఓపెనింగ్.. యోని ఓపెనింగ్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా రెండోది మూత్ర విసర్జనకు దగ్గరగా ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా పాయువు నుంచి యోని ఓపెనింగ్ వరకు ప్రయాణించగలదు, ఆపై మూత్ర విసర్జన ద్వారం వరకు వెళ్లగలదు. ఇది మహిళల్లో సర్వసాధారణం. మగవారితో పోలిస్తే మహిళల్లో మూత్రనాళం తక్కువగా ఉండటమే ఇందుకు కారణం కాగా బ్యాక్టీరియా వేగంగా ప్రయాణిస్తుంది, ఇన్ఫెక్షన్ త్వరగా సంభవిస్తుంది.

ఒక మనిషి పురుషాంగం నెట్టడం ద్వారా మూత్రాశయం వెనుక గోడను ఇరిటేట్ చేస్తుంది, జీవులకు మసాజ్ చేస్తుంది. సంభోగం తర్వాత స్త్రీ మూత్ర విసర్జన చేయకపోతే.. ఆ జీవులు లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి. ఇది హనీమూన్ సిస్టిటిస్‌కు దారితీస్తుంది. అంటే సరైన రక్షణ లేకపోవడం అనేది బ్యాడ్ సెక్స్‌కు దారితీయడమే కాదు హనీమూన్ సిస్టిటిస్‌ను డెవలప్ చేసి, లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

హనీమూన్ సిస్టిటిస్ లక్షణాలు

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) ప్రకారం, 50-60 శాతం మంది మహిళలు తమ జీవితకాలంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎదుర్కొంటారు. ఈ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్న వ్యక్తులు చాలా అసౌకర్యంగా ఉంటారు. అయితే హనీమూన్ సిస్టిటిస్ అనేది లైంగిక కార్యకలాపాల వల్ల మాత్రమే కాకుండా ఏదైనా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మూత్రపిండాల్లో రాళ్లు లేదా రేడియేషన్ ఎక్స్‌పోజర్ కారణంగా కూడా సంభవించే అవకాశం ఉంది.

లక్షణాలు:

* ఇన్ఫెక్షన్ కారణంగా తరచుగా మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది.

* యూరిన్ చేసేటప్పుడు మంట కలిగిన అనుభూతి ఉంటుంది.

* యూరినేట్ సమయంలో నొప్పిని, అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు.

* లక్షణాలు తీవ్రమైతే అధిక-స్థాయి జ్వరాన్ని కూడా కలిగిస్తుంది.

* దిగువ పొత్తికడుపులో నొప్పి అధికంగా ఉంటుంది.

ట్రీట్మెంట్:

హనీమూన్ సిస్టిటిస్‌ డెవలప్ అవుతుందనే అనుమానం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. దీంతో సులభంగా చికిత్స చేయవచ్చు. కాబట్టి సిగ్గుతో ఇలాంటి విషయాలను బయటకు చెప్పకుండా ఉండే బదులు సహాయం కోరడమే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అదే సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే ఇన్ఫెక్షన్స్‌కు దూరంగా ఉండొచ్చని చెప్తున్నారు.

* సెక్స్ తర్వాత వెంటనే యూరిన్ చేయాలి. తద్వారా జననేంద్రియ ప్రాంతం చుట్టూ లేదా మూత్రనాళంలో బ్యాక్టీరియా ప్రభావం లేకుండా ఉంచగలరు.

* మూత్రనాళం నుంచి బ్యాక్టీరియాను బయటకు నెట్టేయాలంటే పుష్కలంగా నీరు త్రాగాలి.

* మూత్రనాళంపై ఎక్కువ రాపిడిని కలిగించని ఆల్టర్నేటివ్ సెక్స్ పొజిషన్స్ ట్రై చేయాలి.

* మూత్ర విసర్జన తర్వాత ఎల్లప్పుడూ ముందు నుండి వెనుకకు తుడవండి. తద్వారా మలద్వారం నుంచి మూత్రనాళం, యోనికి వెళ్లకుండా బ్యాక్టీరియాను నిరోధించవచ్చు.

Advertisement

Next Story