Rajnath Singh: 'హద్దులు దాటేందుకు భారత్ ఏమాత్రం ఆలోచించదు'

by Javid Pasha |   ( Updated:2022-04-23 13:44:55.0  )
Rajnath Singh: హద్దులు దాటేందుకు భారత్ ఏమాత్రం ఆలోచించదు
X

Rajnath Singh

దిశ, వెబ్‌డెస్క్: భారత్ తన సరిహద్దులు దాటే విషయంలో ఏమాత్రం ఆలోచించదంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) అన్నారు. శనివారం ఓ సభలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంపై ఉగ్రవాదులు దేశ అవతలి నుంచి దాడులు చేస్తే సరిహద్దు దాటేందుకు భారత సైన్యం పెద్దగా ఆలోచించదని ఆయన చెప్పుకొచ్చారు. భారత సరిహద్దు తీరంలోని ప్రతి ప్రదేశంలోనూ సైన్యం ఒకేలా పనిచేస్తోంది. ఎక్కడా వెనకంజ వేయడం కాదు కదా ఆ ఆలోచన కూడా కనిపించదని రాజ్‌నాథ్ అన్నారు. అయితే తాజాగా పలు ఈశాన్య ప్రాంతాల్లో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్స్‌కు రక్షణ శాఖ తొలగించింది. దీనిపై స్పందించిన మంత్రి ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు మెరుగైన కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ సభలో రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను కొందరు పరోక్ష బెదిరింపులుగా చెబుతుంటే. మరికొందరు మాత్రం తమ సత్తా చాటేందుకు భారత్ రెడీగా ఉంటుందని రక్షణ దళాలు ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నాయంటూ గర్వపడుతున్నారు.

Advertisement

Next Story