వరద బీభత్సం.. మర్రివాడలో బాహుబలి సీన్ (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-12-16 16:42:23.0  )
వరద బీభత్సం.. మర్రివాడలో బాహుబలి సీన్ (వీడియో)
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మంథని పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంతాకాదు. మర్రివాడకు వరద ఉధృతి పెరడగంతో అక్కడినుంచి బయటపడేందుకు ఓ కుటుంబం పడ్డ కష్టం బాహుబలి సీన్‌ను తలపించింది. సినిమాలో గ్రాఫిక్స్‌తో క్రియేటివిటీ చేస్తే.. ఇక్కడ మాత్రం ప్రత్యక్ష్యంగా సాక్షాత్కరించింది. మర్రివాడకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో మూడు నెలల పసికందును బుట్టలో పెట్టి తలపై ఉంచుకుని భుజాల వరకు వచ్చిన నీటిలో తరలించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మంథని పట్టణంలో వరద పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఈ దృశ్యం కళ్లకు కట్టినట్టుగా చూపెడుతోంది.

Advertisement

Next Story