- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'విరాటపర్వం' సినిమాకు చిక్కులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..
దిశ, వెబ్‌డెస్క్: వేణు ఊడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా 'విరాటపర్వం'.భారీ అంచనాల మధ్య ఈ మూవీ జూన్ 17న విడుదలైంది. అయితే మొదట్లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ఉన్నాఇప్పుడు మాత్రం వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇటీవల సాయి పల్లవి ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇంకా ఆ వివాదం నడుస్తూనే ఉండగా.. ఈ చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా, విరాటపర్వం సినిమాను బ్యాన్ చేయాలంటూ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
విశ్వ హిందూ పరిషత్ విద్యాసాగర్ జిల్లా కార్యదర్శి కె. అజయ్ రాజ్ శనివారం సాయంత్రం ఈ సినిమాపై ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో.. ''విరాట పర్వం సినిమా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉంది. పోలీసులను సైతం కించ పరిచే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇందులో చాలా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలి''అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిషేదిత సంస్థలైన నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే సినిమాలకు సెన్సార్ బోర్డ్ ఎలా అనుమతులు ఇస్తుందని ప్రశ్నిస్తూ..సెన్సార్ బోర్డ్ అధికారి శిఫాలి కుమార్ పై కూడా ఫిర్యాదు చేశాడు.