- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రొస్థెటిక్ మోకాలు: 'కదం' రూపొందించిన ఐఐటీ మద్రాస్
దిశ, ఫీచర్స్: దేశంలోనే మొట్టమొదటిసారిగా మేడ్-ఇన్-ఇండియా ప్రొస్థెటిక్ మోకాలును ఐఐటీ మద్రాస్ డెవలప్ చేసింది . 'కదం'గా పిలుస్తున్న ఈ పాలిసెంట్రిక్ కృత్రిమ మోకాలు 'దివ్యాంగుల' జీవితాలను మార్చుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
ఐఐటీ మద్రాస్‌లోని TTK సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైస్ డెవలప్‌మెంట్ (R2D2) బృందం ఈ కృత్రిమ మోకాలును అభివృద్ధి చేసింది. గతంలో దేశంలోని మొట్టమొదటి స్టాండింగ్ వీల్‌చైర్ 'అరైజ్'ను అభివృద్ధి చేసిన ఈ టీమ్ ఈసారి దివ్యాంగుల కోసం ఈ ప్రత్యేక మోకాలును రూపొందించింది. దివ్యాంగులు, కదలికల పరంగా బలహీనతలు ఉన్న వ్యక్తుల కోసం అవసరమైన సహాయక పరికరాలను రూపొందించేందుకు R2D2 పరిశోధనలు చేస్తోంది. ఈ క్రమంలోనే సొసైటీ ఫర్ బయో మెడికల్ టెక్నాలజీ (SBMT), మొబిలిటీ ఇండియా తో కలిసి పాలిసెంట్రిక్ మోకాలు అభివృద్ధి చేశారు.
కదమ్ ఫీచర్స్ :
* ఈ వినూత్న ఉత్పత్తి మోకాళ్లపై ఉన్న ఆంప్యూటీలు సౌకర్యవంతంగా నడవడానికి సాయపడుతుంది.
* ఇది గరిష్టంగా 160 డిగ్రీల కోణంలో మోకాలును వంచేందుకు ఉపకరిస్తుంది.
* ఇరుకైన ప్రదేశాల్లో ముఖ్యంగా బస్సులు, ఆటో రిక్షాలు మొదలైన వాటిలో కూర్చోవడాన్ని సులభతరం చేస్తుంది.
* నడిచేటప్పుడు కృత్రిమ కాలుపై వినియోగదారుకు ఎక్కువ నియంత్రణను అందిస్తుంది.
* అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి అధిక బలమైన పదార్థాలతో దీన్ని రూపొందించారు.
* విభిన్న నడక వేగం కోసం ఫిక్షనల్ స్వింగ్ ఉపయోగపడుతుంది.
* నాణ్యత, పనితీరు విషయంలో ISO 10328 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు.