అలా చేస్తున్న గుడ్లగూబ ఫొటో షేర్ చేసిన అధికారి.. పోస్ట్ వైరల్

by Javid Pasha |   ( Updated:2022-04-07 12:24:14.0  )
అలా చేస్తున్న గుడ్లగూబ ఫొటో షేర్ చేసిన అధికారి.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిరోజూ ప్రపంచాన్ని ఆశ్చర్చపరిచే ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటాయి. కొన్ని అందరినీ నవ్విస్తే, మరికొన్ని అందరినీ సందిగ్దంలో పడేస్తుంటాయి. తాజాగా ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఇలాంటి ఫొటోనే నెట్టింట షేర్ చేశారు. భారత ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద షేర్ చేసిన గుడ్లగూబ ఫొటో యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. చెట్టుపై ధ్యానం చేస్తున్న ఈ గుడ్లగూబ ఫొటో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఫొటో షేర్ చేస్తూ 'ఇది చూసే ప్రతి ఒక్కరినీ మభ్యపెట్టే చిత్రం' అంటూ నంద రాసుకొచ్చారు.

అయితే ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా.. చెట్టుపై ధ్యానం చేస్తున్న గుడ్లగూబ అంత త్వరగా కనిపించదు. చెట్టులో చెట్టుగా కలిసిపోయింది. ఈ ఫొటో షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే నెట్టింట తెగ వైరల్ అయిపోయింది. 'ఈ ఫొటోలు గుడ్లగూబను చూడటానికి నేను ముందుగా కొన్ని క్షణాలు ధ్యానం చేయాల్సి వచ్చింది' అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఇంతకీ ఆ ధ్యానం చేస్తున్న గుడ్లగూబ ఎక్కడుంది సార్ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed