ఇండస్ట్రీలో బతకాలంటే రాజకీయం తెలియాలి.. అది నాకు ఇంకా రావట్లేదు.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
ఇండస్ట్రీలో బతకాలంటే రాజకీయం తెలియాలి.. అది నాకు ఇంకా రావట్లేదు.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్స్ సుజీత్, సందీప్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'క'. 70వ దశకంలోని విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో వస్తున్న ఈ చిత్రాన్ని చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. ఇక కిరణ్ అబ్బవరం సరసన నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ మూవీని దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్‌ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం 'క' మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. ఇక ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. "సినీ పరిశ్రమలో నిలబడాలంటే కొంచెం లౌక్యం ఉండాలి, రాజకీయం ఉండాలి. అవి నాకు ఇంకా రావట్లేదు. నేను మంచి కథలే ఎంచుకున్నా ఎగ్జిక్యూషన్‌లో ఎక్కడో తేడా వస్తుంది. మొదటి రెండు సినిమాలు నేను అన్ని చూసుకున్నాను. కానీ ఆ తర్వాత పలు సినిమాలకు నా పాత్ర వరకే చూసుకొని మిగతావి వదిలేశాను. అందుకే అవి విజయం సాధించలేకపోయాయి. కాబట్టి ఇప్పుడు అన్ని చూసుకుని జాగ్రత్తగా ఈ సినిమా చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల నేను చాలా ఒత్తిడికి గురవుతున్నాను. కానీ, సినిమా విజయం కోసం తప్పదు" అని కిరణ్ అబ్బవరం తెలిపారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story