ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు బంపర్ ఆఫర్: ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్స్

by Harish |
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు బంపర్ ఆఫర్: ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసిఐసిఐ బ్యాంక్ తన కస్టమర్ల కోసం 'మాన్‌సూన్ బొనాంజా'(Monsoon Bonanza) పేరుతో ప్రత్యేక మాన్‌సూన్ ఆఫర్‌లను తీసుకొచ్చింది. ఈ కామర్స్ వెబ్‌సైట్‌లలో చేసే లావాదేవీలపై భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. కస్టమర్‌లు క్యాష్‌బ్యాక్ రూపంలో 50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చేసే లావాదేవీలపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ICICI డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల EMIలపై కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. వర్షాకాలంలో వినియోగదారులు రోజూ ఉపయోగించే వస్తువులపై బ్యాంక్ ప్రత్యేకంగా బొనాంజాను తెచ్చింది. ఐసీఐసీఐ కార్డులతో ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.7,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 2022 జులై 31 వరకు ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి.

మొబైల్స్‌పై ఉన్న డిస్కౌంట్స్..

* OPPO ఫోన్‌లపై కనీసం రూ.12,000 కొనుగోలుపై గరిష్టంగా 10% క్యాష్‌బ్యాక్.

* ఎంపిక చేసిన ఫోన్‌లలో Vivo X-సిరీస్, V-సిరీస్, Y & T-సిరీస్‌లపై రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్.

* Xiaomi ఎంపిక చేసిన ఫోన్‌లపై గరిష్టంగా రూ.7,500 తగ్గింపు.

* Realme ఫోన్‌లపై కనీసం రూ.10,000 కొనుగోలుపై 10% తగ్గింపు.

* iQOO మొబైల్ ఫోన్‌లపై కనీసం రూ.13,999 కొనుగోలుపై రూ. 4,000 వరకు తగ్గింపు.

* Samsung ఉత్పత్తులపై గరిష్టంగా 22.5% క్యాష్‌బ్యాక్.

* LG ఎలక్ట్రానిక్స్‌పై కనీసం రూ. 20,000 కొనుగోలుపై 20% వరకు క్యాష్‌బ్యాక్.

* ప్రతి గురువారం కనీసం రూ.10,000, రూ. 5,000 కొనుగోలుతో క్రోమాలో రూ. 2,500 వరకు తగ్గింపు.

Advertisement

Next Story